Suicide : పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం బానిసైన ఓ యువకుడు భార్య మందలించిందన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోటవాని వలస గ్రామానికి చెందిన కిషోర్ (30) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే గత కొంతకాలంగా మద్యం వ్యసనానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా అలవాటు విడిచిపెట్టలేకపోయాడు. ఇటీవలి రోజుల్లో పనులు కూడా మానేసి మద్యం మత్తులోనే రోజులు గడిపేవాడు. ఈ కారణంగా అప్పుల పాలయ్యాడు. మద్యం […]
తుఫాన్ ప్రభావం.. తెలంగాణలో పంట నష్టం లిస్ట్ ఇదే.. మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వానికి అందిన వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా వరంగల్ జిల్లాలో పంట నష్టం చోటు చేసుకోగా, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోనూ రైతులు భారీగా నష్టపోయారు. తుఫాను కారణంగా ప్రధానంగా వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2.80 లక్షల ఎకరాల్లో వరి […]
Nimmala Ramanaidu : తుఫాన్ ‘మొంథా’ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వరదల ప్రమాదం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తతతో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉపనదులకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, పరిస్థితిని సమీక్షించిన మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద సుమారు 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే, బుడమేరుపై […]
మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, పంటనష్టం చోటుచేసుకున్నప్పటికీ, ముందస్తు చర్యల వల్ల నష్టం చాలా వరకు తగ్గించగలిగామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
తిరుపతిని గ్రేటర్‌గా మార్చడంపై టీడీపీలోనే భిన్నాభిప్రాయాలున్నాయా? కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ విషయంలో అసహనంగా ఉన్నారా? ఇక్కడ వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోందన్నది నిజమేనా? మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా జై కొట్టినా సమస్య ఎక్కడ వస్తోంది? ఎమ్మెల్యేలు ఎందుకు వ్యచిరేకిస్తున్నారు? జనం నుంచి ఉన్న అభ్యంతరాలేంటి? తిరుపతి మున్సిపాలిటీని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చడం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ మేరకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పెట్టిన ప్రతిపాదనకు సభ్యులంతా ఏకగ్రీవంగా జై కొట్టారు. […]
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు కీలక దశకు చేరింది. ఈ కేసు వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇటీవల వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నఅప్పన్న అరెస్టు కావడంతో పలు ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అధికారం లేనప్పుడు అగ్రెసివ్ పాలిటిక్స్చేసిన ఆ టీడీపీ సీనియర్స్ ఇద్దరూ… పవర్లోకి వచ్చాక ఎందుకు కామ్ అయిపోయారు? పార్టీలోనే ఉన్నాంలే… అని చెప్పడానికా అన్నట్టు అప్పుడప్పడు గొంతు సవరించుకోవడం, మీడియా మైకుల ముందు నోరు తెరవడం తప్ప ఇంకేమీ ఎందుకు చేయడం లేదు? పార్టీ అధిష్టానం మీద వాళ్ళు అలకబూనారా? లేక ఇంకెవరి మీదన్నా కోపం ఉందా? ఎవరా సీనియర్స్? ఏంటా కామ్ కహానీ? సింహపురి రాజకీయాలు ఎప్పుడూ హై ఓల్టేజ్లోనే ఉంటాయి. ఆధిపత్యం కోసం అధికార, […]
Vangalapudi Anitha : మొంథా తుఫాన్ ప్రభావంతో పెన్నా నదిలో ఉధృతంగా పెరిగిన వరద ప్రవాహం నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజ్‌కు భారీ ప్రమాదం కలిగించే పరిస్థితి ఏర్పడింది. వరదలో కొట్టుకుపోయిన 30 టన్నుల భారీ బోటు బ్యారేజ్ గేట్లకు అడ్డంగా పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణ చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తుఫాన్ కారణంగా రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు వాగులు, వంకలు పొంగిపొర్లేలా చేశాయి. పెన్నా నదిపై ఉన్న సంగం బ్యారేజ్‌కు లక్షల […]
తుఫాన్ సమయంలో ప్రజలకు అండగా నిలిచాం.. గుంటూరు జిల్లా తెనాలిలో మొంథా తుఫాన్ బాధితులకు మంత్రి నాదెండ్ల మనోహర్ నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం పంపిణీ చేశారు. చంద్రబాబు కాలనీలో పునరావాస కేంద్రాల్లో ఉన్న 615 మందికి మూడు రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల, కలెక్టర్ తమీమ్ అన్సారియా, సబ్ కలెక్టర్ సంజనా సింహతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. అధికార […]