మాటకు మాట కాదు…. ఒకటికి రెండు మాటలతో సమాధానం చెప్పబోతున్నారా? ఎమ్మెల్సీ కవిత విషయంలో ఇప్పటికే హద్దులన్నీ చెరిగిపోగా… ఇక నుంచి డోస్ డబుల్ చేయాలని బీఆర్ఎస్ డిసైడైందా? కవిత మీద ఇన్నాళ్ళు చేసిన విమర్శలు ఒక లెక్క, ఇక నుంచి చేయబోయేవి మరో లెక్కగా మారబోతోందా? ఈ మాటల యుద్ధంలో టాప్ సీక్రెట్స్ కూడా బయటపడబోతున్నాయా? లెట్స్ వాచ్. నువ్వు తమలపాకుతో ఒకటంటే… నేను తలుపు చెక్కతో నాలుగంటాను అన్నట్టుగా మారిపోయింది ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ […]
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ క్లాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అద్భుతమైన పాలన అందిస్తున్నారని ప్రధాని అభినందించారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్న తీరు శుభపరిణామమని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో బీజేపీ […]
YSRCP : నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై ఈనెల 18న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు టీడీపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో, నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గతంలో వైఎస్సార్సీపీ తరపున గెలిచి, ఆ తర్వాత టీడీపీలోకి వలస వెళ్లిన ఐదుగురు కార్పొరేటర్లు ఇప్పుడు తిరిగి వైఎస్సార్సీపీలోనే కొనసాగుతామని ప్రకటించడం విశేషం. మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలిసిన ఈ ఐదుగురు కార్పొరేటర్లు, తమ నిర్ణయాన్ని ఆయన సమక్షంలో […]
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి తమ హవాను చాటారు. మొత్తం 4,231 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగ్గా, వెలువడుతున్న తొలి ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తాజా సమాచారం ప్రకారం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు దాదాపు 850 సర్పంచ్ పదవులను కైవసం చేసుకుని, 80% స్థానాల్లో విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 350 స్థానాలు, బీజేపీ 60 […]
వంగవీటి కుటుంబం నుంచి మరో వారసత్వం పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతోందా? అందుకోసం గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ జరిగిపోతోందా? కొత్తగా రాజకీయ ప్రవేశం చేయబోతున్న ఆ వారసులు ఎవరు? ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? అసలు ప్లానింగ్ ఏంటి? ఆశాకిరణ్…. ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద తళుక్కుమంటున్న సరికొత్త కిరణం. రాజకీయాల దిశగా దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమార్తె వేస్తున్న అడుగులు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి అభిమానులు ఉన్నారు. రంగా […]
అమరావతిలో ఏర్పాటు అవుతున్న క్వాంటం వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విద్య, వైద్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ రంగాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం పనిచేయాలని సీఎం సూచించారు. సచివాలయంలో వివిధ దేశాల నుంచి బృందంగా వచ్చిన పరిశోధకులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల బృందంతో సీఎం సమావేశం అయ్యారు. CM Chandrababu: ప్రజా సేవ, ప్రచారం రెండూ ముఖ్యమే.. తెలుగు తమ్ముళ్లకు సీఎం దిశానిర్ధేశం.. వైద్యరంగంలో నూతన […]
ఆదోని జిల్లా విషయంలో కొత్త డ్రామాకు తెర లేస్తోందా? సీఎం చంద్రబాబు సైతం పరిశీలించమని చెప్పినా…. మొత్తం మేటర్ని పక్కదారి పట్టించే ఎత్తుగడలు నడుస్తున్నాయా? కూటమిలో… అందులోనూ… తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి? అందరి అభిప్రాయాలకు భిన్నంగా మోకాలడ్డుతున్న ఆ ఒక్క ఎమ్మెల్యే ఎవరు? ఎందుకలా జరుగుతోంది? ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్న క్రమంలో… మెల్లిగా అది కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపుతున్నట్టు కనిపిస్తోంది. వాళ్ల వ్యవహారం మొత్తం ఉద్యమాన్నే […]
Konda Surekha : మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.ఇటీవల మంత్రి సురేఖ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతోంది. Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. హసీనా పదవీచ్యుతి తర్వాత తొలి ఎలక్షన్స్.. అయితే.. నిర్దేశించిన తేదీన విచారణకు మంత్రి కొండా సురేఖ […]
Droupadi Murmu : శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. ఐదు రోజులపాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్ల పై గురువారం డా.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి విస్తృత ఏర్పాట్లు చేయాలని సి.ఎస్. ఆదేశించారు. కేంద్ర […]
Telangana Rising Global Summit : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను నేడు (గురువారం) పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు, విద్యార్థినీ, విద్యార్థులు సందర్శించారు. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో ఈ స్టాళ్లను దర్శించడానికి బారులు తీరారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమాలు “డిస్కవర్ తెలంగాణ: కల్చరల్ హెరిటేజ్ అండ్ నెక్స్ట్–జెన్ టూరిజం” అనే అద్భుతమైన […]