Kavitha : కరీంనగర్ జిల్లా పరిధిలో జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జాగృతి జనం బాట పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని పేర్కొన్నారు. “సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం అన్ని వర్గాల వారినీ కలుపుకొని ముందుకు సాగుతున్నాం. విద్య, వైద్యం వంటి కీలక అంశాలు ఇంకా జనాల మధ్య లోతుగా చేరాల్సి ఉంది,” అని కవిత తెలిపారు. సింగరేణి సంస్థను కాపాడడంలో మాజీ సీఎం కేసీఆర్ […]
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ప్రభావం ఎంత? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ డిపాజిట్ కూడా దక్కని పార్టీ… లోక్‌సభ ఎన్నికల నాటికి అనూహ్యంగా పుంజుకోవడాన్ని ఎలా చూడాలి? అసెంబ్లీకి ఒకలా, పార్లమెంట్‌కు మరోలా తీర్పునిచ్చిన ఓటర్ల మైండ్‌సెట్ ఈసారి ఎలా ఉండబోతోంది? ఆ విషయంలో కాషాయదళం ధీమా ఏంటి? జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. కానీ… ఇప్పటిదాకా ఎప్పుడూ భారీగా పోలింగ్ నమోదైన దాఖలాలు లేవు. 50 శాతానికి కాస్త […]
KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార వేగాన్ని మరింత పెంచారు. శుక్రవారం షేక్‌పేట్‌లో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. నందీనగర్ నివాసం నుంచి ప్రారంభమైన ఈ ప్రచారం సాయంత్రం వరకు ఉత్సాహంగా సాగింది. వేలాదిగా చేరిన కార్యకర్తలు, స్థానిక ప్రజలు “కేటీఆర్ జయహో”, “కారు గుర్తుకే ఓటు” అంటూ నినాదాలు చేశారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా నిర్వహించిన ఈ ప్రచారంలో మాట్లాడిన కేటీఆర్, […]
CM Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రోజు రోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోలో ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. “జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరేస్తుంది అనే నమ్మకం నాకు వచ్చింది. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం. ప్రతి సారి అవకాశం రావడం జరగకపోవచ్చు కానీ, […]
Siddipet Taravva : సిద్దిపేట జిల్లాలో తారవ్వ అనే మహిళా రైతు పంట నష్టపోయిందంటూ కలెక్టర్ కాళ్లు పట్టుకున్న ఘటనపై సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెంటనే స్పందించారు. ఈ సంఘటన మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో కమిషనర్ తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు తారవ్వ పంటను పూర్తిగా కొనుగోలు చేశారు. అంతేకాకుండా తారవ్వ అకౌంట్లో పంట మొత్తాన్ని కూడా డిపాజిట్ చేశారు. కేవలం […]
Chiranjeevi : సోషల్ మీడియాలో సినీనటుడు మెగాస్టార్ చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, డిప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో డీసీపీ కవిత మీడియాతో మాట్లాడారు. డీసీపీ కవిత వివరాల ప్రకారం.. చిరంజీవి ఫిర్యాదు మేరకు ఇప్పటివరకు రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చిరంజీవి ఫిర్యాదుతో రెండు కేసులు నమోదు చేసామన్నారు. 25 పోస్టులకు పైగా గుర్తించామని, వాటిపై దర్యాప్తు […]
జూబ్లీహిల్స్ బై పోల్‌లో బీఆర్ఎస్ స్ట్రాటజీ మారుతోందా? ఓటర్లకు దగ్గరవడానికి కొత్త కొత్త ఎత్తులు వేస్తోందా? పోటీలో లేని ఓ రెండు ప్రధాన రాజకీయ పార్టీల సానుభూతిపరుల్ని తనవైపునకు తిప్పుకునే స్కెచ్ వేసిందా? ఆ దిశగా వర్కౌట్ చేయడం కూడా మొదలైపోయిందా? అసలు కారు పార్టీ కొత్త ప్లాన్ ఏంటి? వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటును తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎలాగైనా గెలిచి తీరాలన్న యాంగిల్లో రకరకాల స్కెచ్‌లు […]
CM Revanth Reddy : వరంగల్ నగరంలో చెరువులు, నాళాల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, వరద ముంపు పరిస్థితులు, చెరువుల పరిరక్షణ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నాళాలు, చెరువులపై అక్రమ కబ్జాలు చేస్తున్న వారెవరైనా వదలరాదని సీఎం హెచ్చరించారు. “ఎంతటి పెద్దవాళ్లు […]
IAS Transfers : తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. మొత్తం ఎనిమిది మంది అధికారులను కొత్త పదవులకు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలతో అభివృద్ధి, సంక్షేమం, రవాణా, గురుకుల విద్య, అర్బన్ డెవలప్మెంట్ వంటి విభాగాల్లో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సభ్యసాచి ఘోష్‌ను ప్రభుత్వం నియమించింది. గురుకుల సంక్షేమ శాఖ కమిషనర్‌గా అనితా రామచంద్రన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రవాణా […]