Google Photosలో కొత్త meme ఫీచర్.. ఆ టూల్‌ని ఎలా ఉపయోగించాలంటే..!
- Google Photosలో ‘Me Meme’ ఏంటి?
- AIతో మీ ఫోటోలను మీమ్స్‌గా మార్చే కొత్త ఫీచర్
- ప్రైవసీకి ప్రాధాన్యం.. మీమ్ క్రియేషన్ పూర్తిగా యూజర్ కంట్రోల్‌లో
- ‘Me Meme’.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గూగుల్ ఫోటోస్ (Google Photos) తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. తాజాగా ఫోటో ఎడిటింగ్‌ను మరింత సరదాగా మార్చేందుకు ‘మీ మీమ్’ (Me Meme) అనే అద్భుతమైన ఏఐ (AI) ఫీచర్‌ను రోల్ అవుట్ చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మీ సొంత ఫోటోలను ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యేలా ఫన్నీ మీమ్స్‌గా మార్చుకునే అవకాశాన్ని గూగుల్ కల్పిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఏమిటీ ‘మీ మీమ్’ (Me Meme) ఫీచర్?
Also Read
- Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
- Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
సాధారణంగా మనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే మీమ్స్ చూసి ఆనందిస్తుంటాం. ఇప్పుడు గూగుల్ ఫోటోస్ మీ గ్యాలరీలోని మీ ఫోటోలను ఉపయోగించి మీమ్స్ తయారు చేసే సౌలభ్యాన్ని ఇస్తోంది. గతేడాది అక్టోబర్‌లోనే ఈ ఫీచర్ గురించి ప్రకటించిన గూగుల్, సుమారు మూడు నెలల విరామం తర్వాత ఇప్పుడు అధికారికంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది కేవలం ఫోటోలను దాచుకునే యాప్‌లా మాత్రమే కాకుండా, ఒక క్రియేటివ్ టూల్‌లా మారుతోంది.
ఏఐతో మీమ్ మేకింగ్ – ప్రైవసీకి పెద్దపీట
ఈ ఫీచర్ పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో ముందే ఉన్న రకరకాల మీమ్ ఫార్మాట్లు , టెంప్లేట్లను వాడుకోవచ్చు. యూజర్లు తమకు నచ్చిన విధంగా టెక్స్ట్‌ను మార్చుకోవచ్చు లేదా జోక్స్ రాయవచ్చు.
అయితే, ప్రైవసీ విషయంలో గూగుల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ ‘మీ మీమ్’ ఫీచర్ ఆటోమేటిక్‌గా మీ ఫోటోలను మీమ్స్‌గా మార్చదు. వినియోగదారుడు స్వయంగా ఒక ఫోటోను ఎంచుకుని, ఆ ఫీచర్‌ను క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. అలాగే, మీరు క్రియేట్ చేసిన మీమ్స్ మీరు సేవ్ చేసే వరకు లేదా ఇతరులకు షేర్ చేసే వరకు మీ అకౌంట్‌లోనే సురక్షితంగా ఉంటాయి.
గూగుల్ ఫోటోస్‌లో మీ సొంత మీమ్స్ కోసం ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:
- స్టెప్ 1: ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ఫోటోస్ యాప్‌ను ఓపెన్ చేయండి.
- స్టెప్ 2: మీ గ్యాలరీలో ఉన్న ఏదైనా స్పష్టమైన ఫోటోను లేదా పోర్ట్రెయిట్ ఇమేజ్‌ను ఎంచుకోండి.
- స్టెప్ 3: ఎడిటింగ్ టూల్స్‌లో మీకు కనిపించే ‘Create’ లేదా ‘Meme’ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
- స్టెప్ 4: అక్కడ ఉన్న లిస్ట్ నుండి మీకు నచ్చిన మీమ్ టెంప్లేట్‌ను ఎంచుకోండి.
- స్టెప్ 5: టెంప్లేట్‌పై ఉన్న టెక్స్ట్‌ను మీకు కావాల్సిన జోక్‌కి అనుగుణంగా ఎడిట్ చేయండి.
- స్టెప్ 6: చివరగా దాన్ని సేవ్ చేసుకోవచ్చు లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నేరుగా షేర్ చేయవచ్చు.
ప్రస్తుత అందుబాటు
ఈ సరికొత్త ‘మీ మీమ్’ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలోని వినియోగదారులకు ముందుగా అందుబాటులోకి వచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లోనే భారతీయ వినియోగదారులకు కూడా ఆండ్రాయిడ్ , ఐఓఎస్ (iOS) ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ఫీచర్ రోల్ అవుట్ కానుంది. మీ ఫోటోలతో మీమ్స్ క్రియేట్ చేయడం వల్ల మీ మెమరీస్ మరింత ఫన్నీగా మారడమే కాకుండా, స్నేహితులతో చాటింగ్ చేసేటప్పుడు కూడా ఇవి ఎంతో వినోదాన్ని అందిస్తాయి.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!