Bharat Summit : పెట్టుబడులు, న్యాయం, ప్రపంచ శాంతి, అహింస అనే మహత్తర లక్ష్యాలతో ప్రతిష్టాత్మక భారత్ సమ్మిట్ – 2025 నేడు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ), నోవాటెల్‌లో రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ సమ్మిట్‌కు విచ్చేసిన వివిధ దేశాల ప్రతినిధులకు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అపూర్వ […]
Asaduddin Owaisi : పాకిస్తాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. అయితే, ఆ నీటిని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిల్వ చేస్తుందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం, ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై ఒవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. “బైసరన్ మైదానంలో సీఆర్పీఎఫ్ జవాన్లను ఎందుకు మోహరించలేదు? దాడి జరిగిన తర్వాత అక్కడికి చేరుకోవడానికి ఎందుకు ఆలస్యమైంది?” అని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదులు మతం […]
CM Renvanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో జరుగుతున్న ఓ కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలన్న ఆదేశాల నుంచి హైకోర్టు ఆయనకు మినహాయింపునిచ్చింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ఎక్సైజ్ కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి అధికారిక కార్యక్రమాల వల్ల కోర్టుకు హాజరుకావడం సాధ్యం కాదని ఆయన తరఫు న్యాయవాదులు […]
Supspend : హైదరాబాద్ బాలానగర్ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు. అవినీతి ఆరోపణలతో ఎస్ఐను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు. ఎస్ఐ లక్ష్మీనారాయణపై పలు అవినీతి అరోపణలు. ఓ మహిళ కేసు విషయంలో ముగ్గురిని అకారణంగా కొట్టినట్లు ఆరోపణలు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో బాధితుల ఫిర్యాదు. హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు […]
Goutham Rao : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌతమ్ రావు ఓటమి అనంతరం తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తన కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకుందని ఆరోపిస్తూ, ఎలక్షన్ కమిషన్ ముందు ఈ విషయాన్ని ఉంచనున్నట్లు తెలిపారు. “ఓటు వేయొద్దని మీ పార్టీ నేతలే చెబితే, మీరు రేపు ప్రజలను ఓటు వేయమని ఎలా అడుగుతారు?” అని ప్రశ్నించారు గౌతమ్ రావు. అలాగే, ఎంఐఎం […]
ఎట్టకేలకు సొంతగడ్డపై విజయం.. ప్లేఆఫ్స్‌కు చేరువైన ఆర్సీబీ! ఐపీఎల్ 2025లో ఎట్టకేలకు సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు రుచిని చవిచూసింది. 18వ సీజన్లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల ఛేదనలో రాజస్థాన్ 9 వికెట్లకు 194 పరుగులే చేయలిగింది. ఐపీఎల్ 2025లో ఆరో విజయంను ఖాతాలో వేసుకున్న ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరువైంది. మరో రెండు విజయాలు సాధిస్తే […]
GHMC : హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్ హాసన్ 63 ఓట్లు సాధించి, తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు (25 ఓట్లు)పై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 78.57 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 66 మంది కార్పొరేటర్లు, 22 […]
Weather Updates : తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు వడగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలు వడగాల్పుల ప్రభావంతో అల్లాడుతున్నాయి. వాతావరణ శాఖ ఏకంగా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఈ జిల్లాలు ఆదిలాబాద్, కుమురంభీం, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల. ఇక్కడ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. మరో 21 […]
NTV Daily Astrology as on 25th April 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..