Gulzar House : హైదరాబాద్ గుల్జార్‌హౌస్ ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకున్న భయంకర అగ్నిప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల ప్రాణాలను బలితీసుకుంది. ముత్యాల వ్యాపారిగా పేరుగాంచిన ప్రహ్లాద్ మోడీ కుటుంబం ఈ విషాద ఘటనలో మృత్యుపాశంలో చిక్కుకుంది. వారి కుటుంబాన్ని చుట్టుముట్టిన మంటలు, ఆనాటి నుండి నేటి వరకు సాగిన వారసత్వాన్ని ఒక్కసారిగా భస్మంగా మార్చేశాయి.
Honda Rebel 500: కుర్రళ్లను అట్రాక్ట్ చేస్తోన్న బైక్.. హోండా కొత్త ప్రీమియం బైక్ రెబెల్ 500 విడుదల
150 సంవత్సరాల క్రితం ఉత్తరాది నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన ప్రహ్లాద్ మోడీ తాత, ముత్యాల వ్యాపారం కోసం గుల్జార్‌హౌజ్ చౌరస్తాలో భవనం కొనుగోలు చేసి వ్యాపారం ప్రారంభించారు. ఆయన తనయుడు పూనంచంద్ మోడీ నుంచి ప్రహ్లాద్‌కి వారసత్వంగా వచ్చిన ఈ వ్యాపారాన్ని ఆయన తన సోదరుడు రాజేంద్రకుమార్‌తో కలసి అభివృద్ధి చేశారు. వ్యాపార ప్రాంగణం కింద ఉన్న రెండు అంతస్థుల భవనం లోయర్ ఫ్లోర్‌లో ఉంది, కాగా పై అంతస్థులు నివాసంగా ఉపయోగిస్తున్నారు.
ప్రహ్లాద్ మోడీకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు అత్తాపూర్‌లో నూతనంగా నిర్మించిన ఇంట్లో నివసిస్తున్నారు. కుమార్తెలు రాజీవ్‌నగర్, సనత్‌నగర్‌లో ఉండి అక్కడే స్థిరపడ్డారు. చిన్న కుమారుడు పంకజ్ మోడీ తన భార్య, ముగ్గురు పిల్లలతో కలసి తండ్రి వద్దే నివసిస్తున్నాడు. ఉత్తరాది నుంచి తరచూ వచ్చే బంధుమిత్రుల రాకతో ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది.
పాతబస్తీ ప్రాంతంతో మమకారం కలిగిన ప్రహ్లాద్ మోడీకి, ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లే ఆలోచన ఎప్పుడూ లేదు. అదే ఆయనకు గండికాగా మారింది. ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదంలో ప్రహ్లాద్ మోడీ దంపతులు, కుమారుడు పంకజ్ మోడీ కుటుంబం, ఇద్దరు కుమార్తెలు, వారి పిల్లలు మొత్తం ఒకేసారి మృత్యువాతపడ్డారు. వారంతా ఉన్న చోటే అగ్ని ముప్పుని ఎదుర్కొన్నారు. వారి మృతవార్త తెలిసిన క్షణం నుండి బంధుమిత్రులు కన్నీరుమునిగిపోయారు.
Rahul Gandhi: పాక్తో భారత్ యుద్ధం.. ఎన్ని విమానాలు కోల్పోయామో చెప్పాలన్న రాహుల్ గాంధీ