Fraud : ప్రభుత్వ ఉద్యోగం అనే ఆశ చూపించి అమాయకులను మోసం చేస్తున్న ఘటన నిజామాబాద్ జిల్లా కోర్టు పరిధిలో వెలుగులోకి వచ్చింది. కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఒక మహిళ నుంచి రూ. 9 లక్షలు తీసుకుని నకిలీ నియామక పత్రం ఇచ్చిన ఘటన కలకలం రేపుతోంది. సిరికొండ మండలం చీమన్‌పల్లి గ్రామానికి చెందిన మాలవత్ మోహన్ అనే వ్యక్తి పై తేజావత్ పిరూ అనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు ఉద్యోగం, పోస్టాఫీస్ ఉద్యోగం వంటి ప్రభుత్వ ఖాళీలను తన పరిచయాలతో పొందిపెడతానంటూ పలువురిని మోసం చేస్తున్న మోహన్, ఇప్పటికే పలువురు వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం.
Balochistan: బలూచిస్తాన్‌లో బలవంతంగా అదృశ్యం అవుతున్న బలూచ్‌లు.. పాకిస్తాన్ సైన్యంపై తీవ్ర ఆరోపణలు
తాజాగా మోహన్ బాధితురాలైన తేజావత్ పిరూకు కోర్టు ఉద్యోగం పేరిట నకిలీ నియామక పత్రం ఇచ్చినట్లు తెలిసింది. అనుమానం వచ్చిన పిరూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారిక గుర్తింపు లేకుండా ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేయడం తీవ్రంగా ఖండించాల్సిన పరిణామమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నిందితుడి పూర్తి చరిత్రను పోలీసు అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో వెలుగు చూడనున్నాయి.
LSG vs SRH: అభిషేక్ శర్మ, దిగ్వేష్ రాఠి మధ్య గొడవ.. తీరు మార్చుకోని దిగ్వేష్