Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Hyderabad Rains : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం.. భారీగా ట్రాఫిక్ జాం
రాజధాని హైదరాబాద్‌లో వర్షం ధాటిగా కురుస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి పటాన్చెరు, లింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, గాజులరామారం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన కొనసాగుతోంది. కూకట్పల్లి, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, చందానగర్, జీడిమెట్లలో భారీ వర్షం కురిసింది. -
Ponnam Prabhakar : కుల గణనలో తెలంగాణకు జాతీయ స్థాయి గుర్తింపు
Ponnam Prabhakar : కుల గణనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఆదివారం మూసాపేటలోని మెజెస్టిక్ గార్డెన్స్‌లో జరిగిన మున్నూరు కాపు, కాపుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోకాపేటలో మున్నూరు కాపు భవనం నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం […] -
KTR : హైడ్రాపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తోందని, ఈ అన్యాయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మౌనం ఎందుకు వహిస్తున్నారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో బుల్డోజర్లను సవాల్ చేసిన రాహుల్ గాంధీ, తెలంగాణలో పేదలపై జరుగుతున్న అన్యాయాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?” అని నిలదీశారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై […] -
Cyber Fraud: ఇరాక్‌లో ఉన్న జగిత్యాల యువకుడికి సైబర్ ముఠా టోకరా.. NTVని ఆశ్రయించిన బాధితుడు
Cyber Fraud: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడు సైబర్ మోసగాళ్ల బారిన పడ్డాడు. అప్పుల పాలై జీవనోపాధి కోసం ఇటీవలే ఇరాక్ వెళ్లిన రాకేష్, సోషల్ మీడియాలో ఫేస్బుక్ ద్వారా మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాడు. రాకేష్ ఫేస్బుక్లో ఒక పోస్ట్‌ను లైక్ చేయడంతో, యూట్యూబర్ హర్ష సాయి పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించిన సైబర్ ముఠా సభ్యులు అతనిని సంప్రదించారు. నమ్మకం కల్పించేందుకు హర్ష సాయి పేరుతో […] -
Top Headlines @5PM : టాప్ న్యూస్
బెంగాల్ మదర్సాలో ఫుడ్ పాయిజనింగ్..100 మందికి అస్వస్థత.. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ లోని ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ మదర్సాలో దాదాపుగా 100 మంది విద్యార్థులు శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వీరంతా ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన అన్స్‌గ్రామ్ లోని పిచ్‌కురి నవాబియా మదర్సాలో జరిగింది. శనివారం ఉదయం దాదాపు 7-8 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. ఆ తర్వాత గంట గంటకు బాధిత విద్యార్థుల సంఖ్య […] -
KTR : హైదరాబాద్ ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి
KTR : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం వేగంగా సాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం షేక్‌పేట్‌లోని ఆదిత్య ఇంప్రెస్ గేటెడ్ కమ్యూనిటీని సందర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో విశేష అభివృద్ధి సాధించిందని చెప్పారు. కేటీఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనేది మా ప్రియమైన నాయకుడు మాగంటి గోపీనాథ్ […] -
KK Report : కేకే సర్వే రిపోర్ట్‌పై కాంగ్రెస్ ఆగ్రహం..
KK Report : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సర్వే వివాదం రచ్చ రేపుతోంది. కేకే సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే రిపోర్ట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ) సాయిరాం ను కలసి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ భేటీ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, కేకే సర్వే సంస్థ […] -
Online Betting: కొడుకును కాపాడుకునేందుకు బంగారం అమ్మిన తల్లి..!
Online Betting: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ పెద్దూరు గ్రామంలో ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ గ్రామానికి చెందిన ప్రణయ్ అనే యువకుడిని బెట్టింగ్ ముఠా ఉచ్చులోకి లాగి భారీ మొత్తంలో వసూళ్లు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రణయ్ గత కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్‌లలో పాల్గొంటున్నాడని, దీనిని ఆసరాగా తీసుకున్న బెట్టింగ్ ముఠా సభ్యులు అతడిపై బెదిరింపులకు దిగినట్లు సమాచారం. కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి దాదాపు […] -
Koti Deepotsavam 2025 Day 1: శివనామస్మరణతో మార్మోగిన ఎన్టీఆర్ స్టేడియం
Koti Deepotsavam 2025 Day 1: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ప్రతి ఏటా కార్తీకమాసంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీవీ – భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా మొదటి రోజు కార్యక్రమం జరిగింది. వేలాదిగా పాల్గొన్న భక్తుల శివనామస్మరణతో వేదిక మార్మోగింది. కార్తీకమాసం శివారాధనకు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. దీపాన్ని వెలిగించడం ద్వారా అంధకారాన్ని తొలగించి ఆత్మజ్యోతి ప్రకాశించనిచ్చే సంకేతంగా భావిస్తారు. […] -
Kashibugga Stampade: తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా
Kashibugga Stampade: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. భక్తుల రద్దీ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలవ్వగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలాన్ని మంత్రి నారా లోకేశ్ సందర్శించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!