Gulzar House: హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం మృత్యుపాశాన్ని మోసుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆ విషాదానికి మూలంగా అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్న ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభావిత భవనానికి ఎదురుగా ఉన్న నగల దుకాణం రాత్రి మూతపడిన అనంతరం, అక్కడి కొన్ని కుటుంబాలు హైటెన్షన్ వైర్ నుంచి కరెంట్‌ను కోక్కేల ద్వారా అక్రమంగా వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ లైన్‌ను ఉపయోగిస్తూ బాధిత కుటుంబం ఇంటి కరెంట్ మీటర్‌పై ఎక్కువ లోడ్ పడినట్లు తెలుస్తోంది. ఆలోచించదగ్గ విషయమేమంటే, అదే లోడ్ కారణంగా మీటర్‌బాక్స్‌లో మంటలు చెలరేగినట్టు.. ఆ మంటలు మొదట మీటర్ బాక్స్‌లో వచ్చి, ఆ బాక్స్ పక్కన ఉన్న ఉడెన్ షోకేజ్‌ను అంటుకున్నాయి.
అక్కడ నుంచి మంటలు మరింతగా వ్యాపించి ఏసీ కంప్రెసర్ వరకు తాకాయి. అప్పటికే భవనం పై అంతస్తుల్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు ఏమీ గ్రహించకుండానే మంటలు ఇంటి అంతటా విస్తరించాయి. ఈ ప్రమాదానికి కారణమైన అక్రమ కరెంట్ కనెక్షన్లపై పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. హైటెన్షన్ లైన్ల నుంచి వ్యక్తిగతంగా కరెంట్ తీసుకోవడాన్ని గమనించి, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా మరిన్ని ఇలాంటి అక్రమ కనెక్షన్లున్నాయా అనే దానిపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో చిన్నచిన్న నిబంధనల ఉల్లంఘన ఎంతటి ప్రాణ నష్టం కలిగించగలదో మరోసారి తేలిపోయింది. అక్రమ కరెంట్ కనెక్షన్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇంకా తీవ్రమైంది.
Techie Suicide: పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. స్పందించిన ఓలా!