Viral News : పుటాణీ హీరోలు.. మానవత్వాన్ని కదిలించిన ఇద్దరు చిన్నారుల కథ..!
- ఇద్దరు చిన్నారుల మానవత్వం
- గాయపడిన కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లిన పిల్లల వీడియో వైరల్
- మానవత్వానికి ఈ చిన్నారులు ఇచ్చిన నిర్వచనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News : ఇప్పటి కాలంలో మనుషుల్లో మానవత్వం క్రమంగా తగ్గిపోతున్నదనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయకపోవడం, మృగాల కన్నా హీనంగా ప్రవర్తించడమూ సహజంగా మారిపోయిన సమాజంలో… కొందరు చిన్నారులు చూపించిన ఉదాత్త భావన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో, ఇద్దరు చిన్నారులు గాయపడిన ఓ మూగజీవిపై చూపించిన ప్రేమకు అందరూ ముగ్దులవుతున్నారు. చక్రాల బండిలో గాయపడిన కుక్కను కూర్చోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ అమూల్యమైన దృశ్యం “janwar.nhi.jaan” అనే సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వీడియలో రోడ్డుపై చక్రాల బండిని ఇద్దరు పిల్లలు తీసుకువస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు తన ఫోన్ కెమెరాలో వీరి ఈ మానవీయ చర్యను చిత్రీకరించాడు.
Bihar: రీల్స్ చేస్తుందని కోడలిపై మామ దారుణం.. చివరకు ఏమైందంటే?
Also Read
- Aura Kid: 'ఆరా కిడ్'గా ఫేమస్ అయిన రెండేళ్ల బుడతడు.. 139M వ్యూస్‌తో ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో..
- MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
- WBBL 2026: కీపర్ 'నో బాల్' బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
- Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.. కుక్క చేతులు పట్టుకుని తూగుతూ, కాదీకి మెల్లగా తీసుకెళ్తున్నారు చిన్నారులు. ఆ వ్యక్తి వారిని అడిగాడు, “ఏం జరుగుతోంది?” దీనికి సమాధానంగా అప్పుడీ చిన్నారుల్లో ఒకరు సాధారణంగా చెప్పారు, “ఇది గాయపడింది సార్.. మేము దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం.” అని. ఈ సమాధానం వినగానే ఆ వ్యక్తి చిరునవ్వుతో “నిజమైన మనుషులు మీరే!” అంటూ మెచ్చుకున్నాడు.
ఈ వీడియో ఇప్పటికే లక్ష తొంభై వేలకి పైగా వ్యూస్ సాధించింది. నెటిజన్లు చిన్నారుల పనిని ఉక్కిరిబిక్కిరిగా ప్రశంసిస్తున్నారు. “ప్రేమ అంటే ఇదే!”, “మూకజీవుల బాధనూ అర్థం చేసుకునే మనిషే నిజమైన మనిషి!” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరొకరు “డిగ్రీలు, హోదాలు కాదు… మానవత్వం నేర్చుకోవాలంటే ఈ పిల్లల్ని చూడాలి!” అని రాశారు. మరో నెటిజన్ అయితే, “ఇదిగో మన పుటాణీ హీరోలు!” అంటూ మురిసిపోయారు.
ఈ చిన్నారుల తక్కువ వయస్సు.. పెద్ద మనసు మనకు ఒక గొప్ప జీవన పాఠాన్ని నేర్పింది. మూగజీవుల పట్ల కనికరం, బాధ్యత అనే విలువలు మన పిల్లల్లోనే మొదలవ్వాలని, సమాజం ఈ ఉదాహరణనుంచి తేలికగా గ్రహించగలదని ఆశించాలి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
-
National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
-
YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
-
Uppada Kothapalli : ఉప్పాడ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా.. ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత
-
Bhogi Release: శర్వానంద్ ‘భోగి’ ఊచకోత అప్పుడే..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!