గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం వెనుక అక్రమ కరెంట్ కనెక్షన్..!
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం మృత్యుపాశాన్ని మోసుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆ విషాదానికి మూలంగా అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్న ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభావిత భవనానికి ఎదురుగా ఉన్న నగల దుకాణం రాత్రి మూతపడిన అనంతరం, అక్కడి కొన్ని కుటుంబాలు హైటెన్షన్ వైర్ నుంచి కరెంట్‌ను కోక్కేల ద్వారా అక్రమంగా వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ లైన్‌ను ఉపయోగిస్తూ బాధిత కుటుంబం ఇంటి కరెంట్ మీటర్‌పై ఎక్కువ లోడ్ పడినట్లు తెలుస్తోంది. ఆలోచించదగ్గ విషయమేమంటే, అదే లోడ్ కారణంగా మీటర్‌బాక్స్‌లో మంటలు చెలరేగినట్టు.. ఆ మంటలు మొదట మీటర్ బాక్స్‌లో వచ్చి, ఆ బాక్స్ పక్కన ఉన్న ఉడెన్ షోకేజ్‌ను అంటుకున్నాయి.
శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌పై వేటు
ప్రముఖ శైవక్షేత్రమైన నంద్యాల జిల్లా శ్రీశైలంలో.. మల్లికార్జునస్వామిగా దర్శనం ఇస్తారు ఆ పరమేశ్వరుడు.. నిత్యం వేలాది మంది భక్తులు మల్లికార్జునస్వామి, భ్రమరాంబ మాత దర్శనానికి తరలివస్తుంటారు.. అయితే, శ్రీశైలం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నపై సస్పెన్షన్ వేటు వేసింది పాలకమండలి.. 10 రోజుల క్రితం కొందరు అన్యమతస్తులు ఆలయ సందర్శనకు వచ్చినట్లు గుర్తించారు.. వారి దగ్గర అన్యమత పుస్తకాలు ఉండటంతో క్యూ లైన్స్ వద్ద తిరిగి వెనక్కి పంపించారు సెక్యూరిటీ సిబ్బంది.. అయితే, సీఎస్‌వోగా ఉన్న అయ్యన్న ఉద్యోగ బాధ్యతలపై నిర్లక్ష్యంగా ఉండటంపై ఈవో సస్పెండ్ చేస్తూ శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.. అన్యమతస్తులు శ్రీశైలంలో హల్‌చల్ చేశారని ఆరోపణలు.. ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. చీఫ్ సెక్రూరిటీగా ఉన్న అయ్యన్నను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు..
‘రాజీవ్ యువ వికాసం’పై సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. లక్షల సంఖ్యలో యువత ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ పథకంలో ఇటీవల ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకానికి ఇప్పటివరకు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన 44,800 దరఖాస్తులు అందాయి. వాటిని మూడు ఉపవర్గాలుగా విభజించి..1, 9, 5 శాతం రిజర్వేషన్ల విధానం ప్రకారం ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. అధికారుల వివరాల ప్రకారం, SC గ్రూప్-B నుండి అత్యధిక దరఖాస్తులు వచ్చాయి.
మరో పాక్ గూఢచారి షాజాద్ అరెస్ట్
భారత్‌లో పుట్టి దేశ ద్రోహానికి పాల్పడ్డ పాక్ గూఢచారుల భరతాన్ని అధికారులు చీల్చి చెండాడుతున్నారు. యూట్యూబర్ల ముసుగులో భారత రక్షణ సమచారాన్ని పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌కు చేరవేసిన హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రాతో పాటు పూరీకి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన వ్యాపారవేత్త షాజాద్‌ను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మొరాదాబాద్‌లో అరెస్ట్ చేశారు. భారత రక్షణ సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేశాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
భారత్-పాక్ ఉద్రిక్తతలు.. పాకిస్తాన్‌ను ఒంటరిని చేసేందుకు బీసీసీఐ సంచలన నిర్ణయం..!
పహల్గామ్ ఉగ్రదాడి.. ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్.. భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.. పాక్‌ను కట్టడి చేస్తూనే.. భారత్ దాడి ముందు నిలువలేకపోయిన దయాది దేశం కాళ్ల బేరానికి వచ్చింది.. అయితే, పాకిస్తాన్‌కు ఈ కుట్రలు, కుయుక్తులు కొత్తకాదు.. దీంతో, ఈ సారి మరింత కఠినంగానే వ్యవహరిస్తోంది భారత్.. ఈ నేపథ్యంలో.. బీసీసీఐ కూడా పాక్‌తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవడంపైనే దృష్టిపెట్టింది.. అందులో భాగంగా ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను ఒంటరిని చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. సరిహద్దులో ఇటీవలి ఘర్షణల తర్వాత పాకిస్తాన్‌ను ఒంటరిని చేసే ప్రయత్నంలో బీసీసీఐ కఠిన వైఖరి తీసుకున్నట్లు సమాచారం. ఈ చర్యలు రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై దీర్ఘకాలిక, శాశ్వత ప్రభావాన్ని చూపనున్నాయి. భారతదేశం మరియు పాకిస్తాన్ ఇప్పటికే ద్వైపాక్షిక క్రికెట్ ఆడేది లేదని తేల్చేసినప్పటికీ.. రెండు దేశాల మధ్య ప్రస్తుత రాజకీయ సంబంధాలు రెండు జట్ల మధ్య బహుళ-జట్టు ఈవెంట్‌లను కూడా ప్రమాదంలో పడేశాయి.
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తెతో జ్యోతి మల్హోత్రా చెట్టాపట్టాల్!
హర్యానా యూట్యూబర్, పాక్ గూఢచారి జ్యోతి మల్హాత్రా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. యూట్యూబ్ ముసుగులో ఆమె చేసిన అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. జ్యోతిని న్యాయస్థానం ఐదురోజులు కస్టడీకి ఇచ్చింది. దీంతో దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌తో జ్యోతి మల్హాత్రా చాలా క్లోజ్‌గా మూవ్ అయింది. చాలా రోజుల నుంచి పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడినట్లుగా మాట్లాడుకున్నారు. గురుద్వారాలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీంతో జ్యోతి పాక్ ఏజెంట్‌గా వ్యవహరించినట్లుగా అధికారులు భావిస్తున్నారు.
పోరాడి డిప్యూటీ మేయర్ సాధించిన జనసేన.. కూటమిలో కొత్త వివాదం..!
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక పూర్తి అయినా.. డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో కూటమి పార్టీలు సుదీర్ఘ కసరత్తు చేయాల్సి వచ్చింది.. అయితే, మేయర్ టీడీపీకి, డిప్యూటీ మేయర్ జనసేనకు అనే ఓ ప్రచారం జరిగినా.. రెండు పోస్టుల కోసం టీడీపీ నేతలు పట్టుబడుతూ వచ్చారు.. అయితే, ఎట్టకేలకు GVMC డిప్యూటీ మేయర్ పదవిని పోరాడి సాధించింది జనసేన పార్టీ.. గంగవరం కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పేరును డిప్యూటీ మేయర్‌గా ఖరారు చేసింది జనసేన అధిష్టానం.. అయితే, జనసేన డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్నా.. ఇప్పుడు కూటమిలో కొత్త వివాదం మొదలైంది..
మరోసారి రంగంలోకి హైడ్రా.. ఈ సారి కూకట్‌పల్లిలో
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లోని ఆక్రమిత నిర్మాణాలను తొలగిస్తూ చర్యలు చేపట్టారు. మొదటగా కూకట్‌పల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ పరిధిలోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్‌లోని అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు ధర్మయుద్ధం ప్రారంభించారు. సర్వే నంబర్ 145లో ఉన్న 9 ఎకరాల లేఅవుట్‌ను అన్‌రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఆధారంగా ఆక్రమించారని, స్థానికులు ఆరోపించారు. ఈ ప్రాంతంలో మొత్తం 79 ప్లాట్లు, వాటికి సంబంధించిన పార్కులు, రహదారులు కబ్జాకు గురైనట్లు ప్లాట్ యజమానులు ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేశారు.