TGIIC : తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన వేలంలో భూముల ధరలు రికార్డు సృష్టించాయి. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీకి నడిబొడ్డున ఉన్న రాయదుర్గం ప్రాంతంలో ఒక ఎకరం భూమికి చదరపు గజానికి రూ.3,40,000 ల చొప్పున గణనీయమైన ధర పలికింది. చదరపు గజానికి ₹3,40,000 ల చారిత్రాత్మక ధరతో ఈ వేలం మునుపటి రికార్డును బద్దలు కొట్టింది. గతంలో, 2017లో చదరపు గజానికి రూ.88,000 ల ధర నమోదైంది. ఈ కొత్త ధర […]
Tiger Tension : కొమురంభీం జిల్లాలో పులి సంచారం స్థానికులలో భయాన్ని పెంచుతోంది. తాజాగా, తిర్యాని మండలంలో పులి దాడి జరిగింది. ఈ దాడిలో రెండు పశువులు చనిపోయాయి. గోండు గూడ, తోయగూడ గ్రామాలకు చెందిన ఆవుల మీద పులి దాడి చేసింది. కుర్పేత కర్ణ, మడావి అంజనా బాయి లకు చెందిన ఆవులపై ఈ దాడి జరిగినట్టు నిర్ధారణ అయ్యింది. అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలం పరిశీలించారు. పులి పాద ముద్రలు గుర్తించారు. పులి […]
జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ, ఓటర్లు మొదటి రెండు గంటలు.. అంటే ఉదయం 9 గంటల వరకు.. మాత్రమే కొంత ఉత్సాహంగా వచ్చి 10% ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత పోలింగ్ శాతం క్రమంగా నెమ్మదించింది. సాయంత్రం 3 గంటల సమయానికి కేవలం 40.2% మాత్రమే ఓటింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మందకొడిగా ఉండటానికి ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, ఇది ఉప […]
ఢిల్లీ పేలుడుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ఈమేరకు ఆయన ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ ముజమ్మిల్ షకీల్… డాక్టర్ ఆదిల్ అహ్మద్.. డాక్టర్ షాహీన్.. డాక్టర్ మొహియుద్దీన్ సయీద్.. డాక్టర్ మొహమ్మద్ ఉమర్.. ఈ పేర్లన్నీ వింటే, ఇది ఏదో వైద్య బృందం అని మీరు అనుకోవచ్చు.. కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను… వీరు ఆసుపత్రి సిబ్బంది కాదు.. రోగుల ప్రాణాలను కాపాడే వైద్యులు కాదు. […]
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు కలకలం సృష్టించింది. చారిత్రక ఎర్రకోట సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఒక కారు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు సంభవించిన వెంటనే మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు వాహనాలకు వ్యాపించాయి. మొత్తం నాలుగు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు […]
Delhi Car Blast : ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో చోటుచేసుకున్న కారు పేలుడు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ స్పందించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమైనదిగా, కలతపరిచేదిగా అభివర్ణించిన ఆయన, మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయంపై ట్విట్టర్లో స్పందించిన రాజనాథ్ సింగ్.. “ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటన అత్యంత […]
Delhi Car Blast : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించి భయాందోళనలు చెలరేగాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం.1 సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సాయంత్రం 6.52 గంటల సమయంలో హ్యుందాయ్ i20 కారు ఒక్కసారిగా పేలిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు కనీసం 10 మంది మృతిచెందినట్లు అధికార వర్గాలు నిర్ధారించాయి. పలువురు […]
139 డ్రోన్స్ నిఘాలో పోలింగ్ కేంద్రాలు.. ప్రైవేటు డ్రోన్స్‌కు నో పర్మిషన్..! జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా భద్రత, పర్యవేక్షణ విషయంలో ఎన్నికల అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికల నిర్వహణలో మొదటిసారిగా డ్రోన్లను వినియోగించనున్నారు. పోలింగ్ లొకేషన్లలో 139 డ్రోన్లను ఉపయోగించి సెక్యూరిటీ మానిటరింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం కానుంది. ఈ మేరకు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి […]
AP Cabinet Decisions : రాష్ట్రంలో భారీ పెట్టుబడుల దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మొత్తం రూ. లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో 70 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. Stampades : దేవాలయాల్లో తొక్కిసలాటల […]