CM Revanth Reddy : తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో జరిగిన కీలక సమావేశం ముగిసింది. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ (GHMC) విస్తరణ వంటి ప్రధానాంశాలపై లోతైన చర్చ జరిగింది. రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఈ నెల 29వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభం అనంతరం కొద్దిపాటి విరామం ఇచ్చి, తిరిగి జనవరి 2వ తేదీ […]
Fraud: హైదరాబాద్ లో క్రిప్టో కరెన్సీ ముసుగులో మరో భారీ ఆర్థిక నేరం వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటల్ ‘తాజ్ డెక్కన్’ పార్కింగ్ లో సినిమా ఫక్కీలో ఒక వ్యక్తి నుండి ఏకంగా కోటి రూపాయల నగదును కాజేసి కేటుగాడు ఉడాయించాడు. అధిక లాభాల ఆశ చూపి నమ్మక ద్రోహానికి పాల్పడిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగిందంటే..? బాధితుడు అత్తాపూర్‌కు చెందిన వ్యక్తి. అయితే.. తనకు తెలిసిన ఒక స్నేహితుడి ద్వారా […]
Telangana : సంక్షేమ శాఖలలో పెండింగ్ లో ఉన్న బకాయిలు అన్ని ఒకేసారి విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లుల బకాయిలు క్లియర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని భట్టి విక్రమార్క అన్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. విద్య విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదని ఆయన […]
Bhatti Vikramakra : తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ రంగ ఉద్యోగులకు, ఆర్టిజన్లకు , పెన్షనర్లకు ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచిని దృష్టిలో ఉంచుకుని, వీరికి రావాల్సిన డియర్ నెస్ అలవెన్స్ (DA) , డియర్ నెస్ రిలీఫ్ (DR) ను 17.651 శాతంగా ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. ప్రతి […]
అక్కడ నీళ్ళలో రాజకీయ నిప్పులు రాజుకుంటున్నాయి. చెక్ డ్యామ్‌తో పరస్పరం చెక్ పెట్టుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు మొదలు పెట్టిన గేమ్ చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తోంది. ఏంటా గేమ్? ఎవరు ఎవరికి చెక్‌మేట్? మానేరు సాక్షిగా జరుగుతున్న మాటల యుద్ధం ఎట్నుంచి ఎటు పోతోంది? దోషులు ఎవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచడంతోపాటు రైతులకు సాగు నీరు ఇచ్చేందుకు గతంలో చెక్ డ్యామ్‌లు కట్టారు. బీఆర్ఎస్ హయాంలో వందల కోట్లు […]
GHMC : భాగ్యనగరవాసులకు జీహెచ్ఎంసీ కమిషనర్ తీపి కబురు అందించారు. దీర్ఘకాలంగా ఆస్తి పన్ను (Property Tax) బకాయిలు ఉన్న వారికి ఊరటనిస్తూ ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ (OTS) పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్ కింద పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. చాలా కాలంగా ఆస్తి పన్ను చెల్లించని ఆస్తులపై భారీగా వడ్డీ (Arrears Interest) పేరుకుపోయింది. పన్ను చెల్లింపుదారుల విజ్ఞప్తి మేరకు, 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను […]
తెలంగాణలో మళ్ళీ సెంటిమెంట్ మంటలు మండబోతున్నాయా? బీఆర్ఎస్ అధిష్టానం ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టేసిందా? పాత సీసాలో కొత్త నీళ్ళు పోసి సరికొత్తగా పొలిటికల్ ప్రజెంటేషన్ ఇవ్వబోతోందా? అసలు ఏ సెంటిమెంట్‌ని తిరిగి రగల్చ బోతోంది గులాబీ పార్టీ? ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది? తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఫుల్ రీ ఛార్జ్ మోడ్‌లోకి రావాలన్న ప్లాన్‌లో ఉంది బీఆర్ఎస్. ఇంకా మూడేళ్ళ టైం ఉన్నందున ఇప్పట్నుంచే మొదలుపెడితే… […]
వివాహేతర సంబంధం ఒక పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడమే కాకుండా, కట్టుకున్న భర్త ప్రాణాలను బలిగొనేలా చేసింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అశోక్ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టగా దిగ్భ్రాంతికి గురిచేసే నిజాలు బయటపడ్డాయి.
తెలంగాణ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను పెంచిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఇప్పుడు తెలంగాణ వైపు ఆసక్తిగా చూస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సమ్మిట్ విజయంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం కేసీఆర్‌కు ఇష్టం లేనట్లు ఆయన మాటలు ఉన్నాయని మంత్రి మండిపడ్డారు. ఈ సమ్మిట్ ద్వారా 5 లక్షల కోట్ల […]
రాయ్‌గఢ్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..! ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో విషాదం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు నోట్లో అన్ని విషయాలు రాసి ప్రాణాలు తీసుకుంది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రిన్సీ కుమారి(20) .. జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ నివాసి. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఒక విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. పుంజిపాత్ర సమీపంలోని విశ్వవిద్యాలయ హాస్టల్లో నివసిస్తోంది. శనివారం రాత్రి హాస్టల్ […]