Hyderabad Rains : హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ‘పైగా’ కాలనీ, విమాన నగర్ ప్రాంతాల్లో వరద బీభత్సం చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా హోండా షోరూమ్‌లోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో సిబ్బంది చిక్కుకున్నారు. షోరూమ్‌లో పనిచేస్తున్న సుమారు 80 మంది కార్మికులు వరదలో ఇరుక్కుపోయి సహాయం కోరారు. వెంటనే షోరూమ్ సిబ్బంది పోలీసులకు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF), హైడ్రా అధికారులకు సమాచారం అందించారు. […]
ATM Robbery : జులాయి సినిమాలో దుండగులు బ్యాంకు దోచిన తరహాలోనే కొంత మంది స్కెచ్చేశారు. కాకపోతే బ్యాంకు కాకుండా ఏటీఎం లూటీకి ప్లాన్ చేశారు. అచ్చం సినిమాల్లో చూపించిన విధంగా ఏటీఎం చోరీ కోసం గ్యాస్ కట్టర్లు, ఇతర పరికరాలు అన్నీ తెచ్చుకున్నారు. దర్జాగా ఏటీఎంలోని డబ్బులు ఎత్తుకెళ్లారు. కానీ సీసీ ఫుటేజీల ఆధారంగా కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వాయిస్: హైదరాబాద్‌లో వరుసగా ఏటీఏం చోరీల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే […]
తెలంగాణ అధికారులకు గవర్నమెంట్ ఆఫీస్‌లు మొహం మొత్తాయా? అందుకే చూపు స్టార్ హోటల్స్ వైపు మళ్ళుతోందా? ఎలాంటి మీటింగ్నైనా… నిక్షేపంగా, కంఫర్ట్‌గా పెట్టుకునే వీలున్న గవర్నమెంట్ బిల్డింగ్స్‌ని వదిలేసి చూపులెందుకు ఏడు నక్షత్రాల హోటళ్లవైపు మళ్ళాయి? ఎవరి కంఫర్ట్ కోసం అదంతా చేస్తున్నారు? ఏం… ప్రజాభవన్‌లో కంఫర్ట్ లేదా? ఏ మీటింగ్ కోసం స్టార్ హోటల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఏంటా కథ? ఏదైనా సమస్యను సవివరంగా, సావధానంగా చెప్పాలంటే…. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బెస్ట్ మెథడ్. కీలకమైన […]
Adulterated Liquor : కల్తీ కల్లు కేటుగాళ్లు తెలివి మీరి పోయారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు.. వ్యాపారాన్ని పెంచుకునేందుకు మాంచి స్కెచ్చేశారు. ఏకంగా కల్తీ కల్లును ప్యాకెట్లలో ప్యాకేజింగ్ చేసి మరీ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నారు. చిన్న హోటళ్ల ద్వారా అమ్మేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివార్లలో కల్తీ కల్లు ప్యాకెట్లు చూసి ఎక్సైజ్ పోలీసులే షాక్ అయ్యారు. ఇక్కడ చూడండి.. ఇక్కడ మీరు చూస్తున్నవి పాల ప్యాకెట్లు అనుకుంటే పొరబడ్డట్టే… పాల ప్యాకెట్లు కాదు.. ఫినాయిల్ ప్యాకెట్లు అంతకంటే […]
అందరిదీ ఒకే పార్టీ…. అంతా అధికారంలోనే ఉన్నారు. అయినా సరే… ఎవరికీ ఎవరితో పడటం లేదా? ఆ ఉమ్మడి జిల్లాలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢీ అంటే ఢీ అంటున్నారా? లోపం ఎక్కడుంది? ఎందుకు మొదలైందా సమస్య? మరీ ఘోరంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థి ఎందుకు వచ్చింది? ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాలే వేరప్పా….అక్కడ ఎవరి మాటా ఎవరూ వినరప్పా…ఎవరికి వారే రాజులు, రారాజులు. ఇదీ జిల్లాలో సమస్యల ప్రస్తావన వచ్చినప్పుడల్లా… కొందరు పెద్ద నాయకుల […]
మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త..! రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు. రానున్న రెండు […]
CM Revanth Reddy : హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. GHMC, HMDA, వాటర్ వర్క్స్ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. CM Chandrababu: “మనమీద నెట్టే రకం”.. మద్యం కుంభకోణంపై స్పందించిన సీఎం చంద్రబాబు.. మున్సిపల్ ప్రాంతాల్లో వర్షపునీటి సమస్యలు తలెత్తకుండా డైవర్షన్ పనులు, […]
Orange Alert : ఇవాళ మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షాలు చుట్టుముట్టాయి. వర్షం కారణంగా ఇప్పటికే పలు రహదారులు నీటమునిగిపోగా, ట్రాఫిక్ జామ్‌లతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైండ్ స్పేస్, ఐకియా చౌరస్తా, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీ చెక్ పోస్ట్, PVNR ఫ్లైఓవర్, జేబీఎస్, తిరుమలగిరి, లక్షీకపూల్ వంటి ముఖ్య ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగి, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే మరోసారి హెచ్చరిక […]
గోషామహల్లో హిందుత్వకు హిందుత్వే కౌంటర్ వేయబోతోందా? తెర మీదికి మరో కాషాయ మిసైల్ దూసుకు రాబోతోందా? ఉప ఎన్నికంటూ జరిగి రాజాసింగ్ తిరిగి పోటీ చేస్తే… ఇన్నాళ్ళు ఆయనకున్న బలం మీదే బీజేపీ దెబ్బకొడుతుందా? అందుకు నేను రెడీ అంటూ అభ్యర్థి కూడా సిద్ధమైపోయారా? ఇంతకీ ఎవరా అభ్యర్థి? అసలు నియోజకవర్గంలోని పరిణామాలు ఎలా మారే అవకాశం ఉంది? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని గట్టిగా పావులు కదుపుతోంది బీజేపీ. 2023లో కూడా అదే […]
ఔనా….? వాళ్ళిద్దరూ కలిశారా….? సీక్రెట్ మీటింగ్ జరిగిందా? సాక్షాత్తు తెలంగాణ సీఎం చేసిన ఆరోపణల్లో నిజమెంత? పైకి ఉప్పు నిప్పులా కనిపించే ఆ రెండు పార్టీల ముఖ్య నాయకులు రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముంది? అసలు ఎవరా తెలుగు రాష్ట్రాల ముఖ్య నాయకులు? తెర వెనక సంగతులేంటి? తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తాజా ఢిల్లీ టూర్లో పలు అధికారిక కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించి ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. […]