TPCC Mahesh Goud : కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మున్నూరు కాపు బిడ్డ అని చెప్పుకునే బండి సంజయ్ బీసీలకు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన అసలు బీసీ కాదని, దేశ్‌ముఖ్ వర్గానికి చెందినవారని విమర్శించారు. దమ్ముంటే బండి సంజయ్ సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు.
Trinamool Congress: బీజేపీ నేతల గొంతులో యాసిడ్ పోస్తా.. టీఎంసీ ఎమ్మెల్యే బెదిరింపు..
బీసీ రిజర్వేషన్ల విషయమై బీజేపీ వైఖరిని ఆయన తప్పుబట్టారు. ప్రధాని మోడీని అడ్డుపెట్టుకుని తాత్కాలికంగా బీసీ రిజర్వేషన్లు నిలిపివేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావడం ఖాయం అని, అప్పుడు బీసీ రిజర్వేషన్లు ఎలా ఆపుతారో చూస్తామని వ్యాఖ్యానించారు. బండి సంజయ్‌కు సవాల్ విసురుతూ, నిజమైన బీసీ పౌరుషం ఉంటే బీసీ బిల్లును చట్టబద్ధం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
కవితపై కూడా ఆయన కఠిన వ్యాఖ్యలు చేశారు. “కవితను జిల్లా కోడలుగా అభిమానిస్తాం, కానీ లిక్కర్ రాణిగా ద్వేషిస్తాం” అని అన్నారు. కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పటానికి కవిత స్వయాన మాటలే నిదర్శనమని విమర్శించారు. కుటుంబ సభ్యులంతా కలిసి దోచుకున్నారని, వాటాల్లో తేడా వల్లే విభేదాలు బయటికొచ్చాయని ఆరోపించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత ఈ మాటలు చెబితే ఆమెకు సన్మానం చేసేవాళ్లమని అన్నారు. కానీ ఇప్పుడు కవితతో కలిసి కేసీఆర్ డ్రామా ఆడుతున్నారని అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ భవిష్యత్తు లేదని మరోసారి స్పష్టం చేశారు. “ఒక సంవత్సరం క్రితం బీఆర్ఎస్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉండదని చెప్పాను, ఇప్పుడు అదే జరుగుతోంది” అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Thanuja Puttaswamy : నాన్న మూడేళ్లు మాట్లాడలేదు.. చేదు ఘటన చెప్పిన తనూజ