CM Revanth Reddy : సీఎం రేవంత్‌తో ఫిరాయించిన ఎమ్మెల్యేల భేటీ.. కడియం శ్రీహరి గైర్హాజరు
- జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసంలో కీలక భేటీ
- స్పీకర్ నోటీసులు – ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు భయం
- కొందరు మాత్రమే స్పందించిన ఎమ్మెల్యేలు – మిగతావారు మౌనం
- కడియం శ్రీహరి గైర్హాజరు – రాజకీయ వర్గాల్లో చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో జరిగిన ఈ చర్చలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ భేటీలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గైర్హాజరుకావడం హాట్ టాపిక్‌గా మారింది. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇటీవల నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షం చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ నోటీసులు వెలువడ్డాయి. అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉండటంతో ఈ నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
స్పీకర్ ఆదేశాల మేరకు కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే వివరణ సమర్పించారు. కానీ ఎక్కువ మంది ఇంకా స్పందించలేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమావేశమవ్వడం వెనక రాజకీయ లెక్కలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. అయితే.. ఫిరాయించిన ఎమ్మెల్యేల జాబితాలో దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), అరెకపుడి గాంధీ (శేరిలింగంపల్లి), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు), సంజయ్ కుమార్ (జగిత్యాల), కాలె యాదయ్య (చేవేళ్ల), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్) హాజరయ్యారు. కానీ కడియం శ్రీహరి మాత్రం ఈ భేటీకి రాకపోవడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది.
Nightmares: చెడ్డ, పీడ కలలతో బాధపడుతున్నారా? ఇది కూడా ఓ కారణం కావచ్చు..!
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!