Liquor Smuggling Racket: గోవా మద్యం దందాపై ఎక్సైజ్ దాడులు.. 92 బాటిళ్లు, 3 కార్లు సీజ్.!
- గోవా లిక్కర్ అక్రమ రవాణా బండారం
- 92 బాటిళ్లు, 3 కార్లు సీజ్
- 15 మంది నిందితులు అరెస్ట్
- ఎక్సైజ్ STF మెరుపు దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Smuggling Racket: ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై ఎక్సైజ్ శాఖ విరుచుకుపడింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా గోవా, ఢిల్లీ, హర్యానా వంటి ప్రాంతాల నుండి నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL)ను తరలిస్తున్న ముఠాలను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ (STF) బృందం పట్టుకుంది. ఎయిర్‌పోర్ట్ నుండి మద్యాన్ని కార్లలో నగరానికి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ అంజిరెడ్డి నేతృత్వంలో పహాడీ షరీఫ్ వద్ద మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నాలుగు వేర్వేరు బృందాలుగా విడిపోయిన అధికారులు మొత్తం 92 మద్యం బాటిళ్లను, మూడు విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు.
అదిరింది.. 36 వేలకే 5 Star 1.5 Ton AC.. Summer రాకముందే అదిరిపోయే Gift..!
Also Read
ఈ అక్రమ రవాణాకు సంబంధించి నాలుగు వేర్వేరు కేసులు నమోదు చేసిన అధికారులు మొత్తం 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మొదటి కేసులో 23 బాటిళ్లు , ఒక కారును స్వాధీనం చేసుకుని నలుగురిపై, రెండో కేసులో 34 బాటిళ్లు , ఒక కారును స్వాధీనం చేసుకుని ఐదుగురిపై, మూడో కేసులో 21 బాటిళ్లు , మరో కారును స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. వీటితో పాటు మరో 14 బాటిళ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ , నిందితులను తదుపరి విచారణ నిమిత్తం మీర్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. తక్కువ ధరకు లభిస్తుందనే సాకుతో గోవా వంటి ప్రాంతాల నుండి విమానాల్లో మద్యాన్ని తెచ్చి, ఇక్కడ గుట్టుచప్పుడు కాకుండా అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా లాభాలు పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణ ప్రియ ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమ మద్యం రవాణాపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల నుండి అనుమతి లేకుండా మద్యాన్ని తీసుకురావడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా ఎన్‌డీపీఎల్ (NDPL) మద్యాన్ని తరలిస్తూ పట్టుబడితే కేవలం మద్యం బాటిళ్లనే కాకుండా వారు ఉపయోగిస్తున్న వాహనాలను కూడా సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. విమాన ప్రయాణికులు నిబంధనలకు విరుద్ధంగా మద్యం బాటిళ్లను తరలిస్తే వ్యక్తులతో పాటు వాహనాలపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోవా, రాజస్థాన్, ఢిల్లీ నుంచి మద్యం అక్రమ రవాణాపై నిఘా మరింత పెంచుతామని ఆమె తెలిపారు.
AI Dating Trend: ఏఐతో డేటింగ్.. న్యూయార్క్‌లో సంచలనం సృష్టిస్తున్న ఏఐ కేప్!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?