Petrol: అత్యంత చౌక ధరకే పెట్రోల్.. లీటరుకు కేవలం రూ.3 మాత్రమే.. ఎక్కడంటే?
- పెట్రోల్ లీటరుకు కేవలం రూ.3 మాత్రమే
- అత్యంత చౌకైన పెట్రోల్ ప్రస్తుతం లిబియా, ఇరాన్లలో
- వెనిజులా ఇప్పుడు మూడవ స్థానంలో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బండి ముందుకు కదలాలంటే ఫ్యుయల్ ట్యాంక్ లో పెట్రోల్ ఉండాల్సిందే. అయితే ధరల పెరుగుదల కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు వాహనదారులు. పెట్రోల్ ధరల దెబ్బకు చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ను యూజ్ చేస్తున్నారు. పెట్రోల్ ధరలు తగ్గితే బావుండు అని ఆలోచించే వారు ఉన్నారు. కానీ కొన్ని చోట్ల ధరలు ఆకాశాన్నంటుతుండగా, మరికొన్ని చోట్ల పెట్రోల్ ఒక కప్పు టీ ధరకే అమ్ముడవుతోంది. కేవలం రూ. 3 కే లీటర్ పెట్రోల్ వస్తుందంటే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇంతకీ ఏ దేశంలో అత్యంత చౌకైన పెట్రోల్ లభిస్తుందో తెలుసా? ఆ వివరాలు మీ కోసం..
Also Read
- Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
- Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
- Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
- Kavya Maran - Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
గ్లోబల్ పెట్రోల్ ధర ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత చౌకైన పెట్రోల్ ప్రస్తుతం లిబియా, ఇరాన్లలో అమ్ముడవుతోంది. ఇక్కడ పెట్రోల్ ధరలు లీటరుకు కేవలం రూ.2.50 నుండి రూ.3 వరకు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత చౌకైన పెట్రోల్ ధర కలిగిన జాబితాలో లిబియా ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ధర లీటరుకు దాదాపు $0.024, అంటే దాదాపు 2.15 రూపాయలకు సమానం. ఎందుకంటే లిబియా చమురు సంపన్న దేశం, కాబట్టి ప్రభుత్వం తన పౌరులకు ఆర్థిక ఉపశమనం కల్పించడానికి చాలా తక్కువ ధరలకు పెట్రోల్‌ను విక్రయిస్తుంది.
లిబియా తర్వాత ఇరాన్ రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ పెట్రోల్ ధరలు లీటరుకు దాదాపు $0.029, అంటే దాదాపు 2.51 భారతీయ రూపాయలు. ఇరాన్ బలమైన సబ్సిడీ విధానం కారణంగా, పౌరులకు ప్రపంచంలోనే అత్యంత చౌకైన పెట్రోల్‌ను అందిస్తుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత చౌకైన పెట్రోల్ ఉత్పత్తిదారుగా ఉన్న వెనిజులా ఇప్పుడు మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ పెట్రోల్ లీటరుకు దాదాపు $0.035, అంటే దాదాపు రూ.3. సబ్సిడీ నెలకు మొదటి 120 లీటర్లకు మాత్రమే చెల్లుతుంది. ఈ మూడు దేశాలతో పాటు, అంగోలా, కువైట్ కూడా చౌకైన పెట్రోల్‌ను అందిస్తున్నాయి. అంగోలా పెట్రోల్‌ను లీటరుకు దాదాపు $0.33 కు విక్రయిస్తుంది, ఇది భారత కరెన్సీలో రూ.27 కు సమానం.
తాజావార్తలు
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
ట్రెండింగ్
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!