Iran Hit List: ఇరాన్ టార్గెట్‌లో ఆ దేశాధినేతే ఫస్ట్.. ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Hit List: ఒక దేశం విడుదల చేసి హిట్‌లో మరొక దేశాధినేత పేరు ఫస్ట్ ప్లేస్‌లో ఉండటం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ హిట్ లిస్ట్ రిలీజ్ చేసిన ఆ దేశం ఏంటో తెలుసా.. ఇరాన్. అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల మధ్య ఫర్ ది ఫస్ట్ టైం ఇరాన్ హిట్ లిస్ట్ విడుదల చేయడం సంచలనంగా మారింది. ఈ జాబితా ఇరాన్ చంపాలనుకునే వారి జాబితా. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇరాన్ రాష్ట్ర మీడియా ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పేరు ఉండటం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ మాత్రమే ఇటువంటి జాబితాలను విడుదల చేసింది, కానీ ఇరాన్ హిట్ లిస్ట్‌ను రిలీజ్ చేయడం ఇదే తొలిసారి.
READ ALSO: Petrol: అత్యంత చౌక ధరకే పెట్రోల్.. లీటరుకు కేవలం రూ.3 మాత్రమే.. ఎక్కడంటే?
Also Read
- Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
- Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటన తర్వాత ఈ హిట్ లిస్ట్ విడుదల కావడం విశేషం. బుధవారం (ఫిబ్రవరి 11) ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కలిసి, పలు అంశాలపై సంభాషణలు జరిపారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా ఇప్పుడు ఇరాన్‌తో ఒప్పందంపై చర్చలు జరుపుతుందని అన్నారు. ఆ తర్వాత ఏమి జరుగుతుందో చూద్దామని అన్నారు. ఇజ్రాయెల్ ఇరాన్‌పై జూన్ 2025లో ఆపరేషన్ రైజింగ్ లయన్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ లక్ష్యం ఇరాన్ అణు కేంద్రాలను నాశనం చేయడం. ఈ ఆపరేషన్ సమయంలో, ఇరాన్ అణు శాస్త్రవేత్తలతో సహా అనేక మంది ఇరాన్ అగ్ర సైనిక అధికారులను చంపింది. ఇజ్రాయెల్ ఆపరేషన్‌లో మరణించిన ఇరానియన్ అధికారులలో ఐఆర్‌జీసీ చీఫ్ హుస్సేన్ సలామి, ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మొహమ్మద్ బాఘేరి, ఐఆర్‌జీసీ వైమానిక దళ చీఫ్ అమీర్ అలీ హజీజాదే మొదలైన వారు ఉన్నారు. తాజాగా ఇరాన్ రిలీజ్ చేసిన ఈ హిట్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.
READ ALSO: Ai.com Domain Sale: రూ.300 పెట్టి కొంటే రూ.634 కోట్ల లాభం! ఇంటర్నెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డీల్..
తాజావార్తలు
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
-
Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!