ఏపీలో నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ మాట్లాడుతూ.. పట్టాభిరామ్ మాట్లాడింది దారుణమైన భాష అన్నారు. అంతేకాకుండా పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేసిన తరువాత నుంచే ఆందోళనలు ప్రారంభమయ్యాయన్నారు. చట్టబద్దమైన పదవుల్లో ఉన్న వారిని తిట్టకూడదన్నారు. పట్టాభిరామ్ నోరు జారి మాట్లాడిన మాటలు కాదని, ఒక పార్టీ ఆఫీసు నుంచి మాట్లాడించారన్నారు. ఒక ముఖ్యమంత్రిపై అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు. దీనితో పాటు నిన్న 5.03 నిమిషాలకు తెలియని […]
టీడీపీ నేతలు సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలు పంజా సెంటర్ లో చంద్రబాబు ఫోటోను చెప్పలతో కొడుతూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భందా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గులేదా అని అన్నారు. చంద్రబాబు ఎలా ముఖ్యమంత్రి […]
ఏపీలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈ రోజు చంద్రబాబు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓవైపు టీడీపీ నేతలు వైసీపీ సర్కార్ తీరుపై దుమ్మెత్తిపోస్తుంటే.. మరోవైపు వైసీపీ నేతలు సీఎం గురించి ఎవరూ అనుచితంగా మాట్లాడినా సహించేది లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. ట్విట్టర్ వేదికగా నారా లోకేష్.. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి అని గౌరవించి గారూ అనేవాడినని, నీ వికృత, క్రూర […]
శ్రీకాకుళంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులతో పాఠశాలకు బయలు దేరిన స్కూల్ బస్సు చెరువులో పడిపోయింది. బుధవారం ఉదయం ఎచ్చెర్ల మండలంలోని కొయ్యం గ్రామ సమీపంలోని నల్ల చెరువులో ఈ ఘటన జరిగింది. 8 మంది విద్యార్థులతో వెళుతున్న స్కూల్ బస్సు చెరువులో పడిపోవడంతో.. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను కాపాడారు.. అప్పటికే ఒక విద్యార్థి మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. విద్యార్థి మృతితో ఆ […]
సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ పేరు మార్చుకోనున్నట్లు ప్రముఖ టెక్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోయినప్పటికీ, రానున్న వార్షిక సదస్సులో సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పేరు మార్చనున్నట్లు సమాచారం. ఇప్పటికే అమెరికా ప్రభుత్వంతో తలెత్తుతున్న సమస్యల వల్ల ఫేస్ బుక్ యూజర్ల సంఖ్య పడిపోతుందని భావించిన ఫేస్ బుక్ నిర్వాహకులు ఇలా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దిగ్గజ సమస్యలు అవసరాన్ని బట్టి మాతృ […]
టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనతో ఏపీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు ఈ రోజు ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బంద్ నిర్వహిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్య నేతలను హౌస్ అరెస్టులు చేసి, భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా టీడీపీ అధికార ప్రతినిధి పంచమూర్తి అనురాధ భావోద్వేగ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో.. జగన్ మోహన్ […]
ఏపీలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖలు రాశారు. టీడీపీ కార్యాలయంపై దాడులను ఖండిస్తూ ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిషా లకు లేఖలు రాశారు. ఈ దాడులపై విచారణ చేపట్టేందుకు సీబీఐ, ఎన్ఐఏలను రంగంలోకి దించాలని కోరారు. అంతేకాకుండా ఇలానే ఉంటే ఏపీ పరిస్థితులు మరింత దిగజారిపోతాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పోలీసులపై నమ్మకం పోయిందని, వెంటనే కేంద్ర బలగాలను రాష్ట్రంలో దించాలని […]
రోజురోజుకి చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో రికార్డు స్థాయిలో ధరలు కొండెక్కాయి. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా టమాట ధరలు ఆకాశానంటుతుండగా.. ఉల్లి సామాన్యులను కంటతడి పెట్టిస్తోంది.ఇప్పుడు చికెన్ ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులు కోడి గుడ్డుతో సరిపెట్టుకుంటున్నారు. ఒక్క చికెన్ ధరలు మాత్రమే కాదు.. మటన్ ధరలు కూడా పెరిగిపోయాయి. శుభకార్యాల సీజన్ కావడంతో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో కిలో చికెన్ స్కిన్ లెస్ ధర రూ. 280 నుంచి రూ. 300 […]
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యాదాద్రి ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే ఎంతో మంది ధన రూపేన, వస్తు రూపేన కానుకలు సమర్పిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా టీఆర్ఎస్ నేతలు యాదాద్రి ఆలయానికి విరాళం ప్రకటించారు. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, శంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, ఎం. హనుమంత రావు, ఎం కృష్ణ రావుతో పాటు కెపి వివేక్ ఆనంద్ లు […]
ఏపీలో రాజకీయం రాజుకుంది. అటు టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా టీడీపీ ఈ రోజు ఏపీ బంద్ కు పిలుపునిస్తే.. కౌంటర్ గా వైసీపీ కూడా టీడీపీ నేతల వ్యాఖ్యలపై నిరసనలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి జవహార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, పార్టీ నాయకులపై దాడులు ద్వారా అంతర యుద్ధం జరగాలని జగన్ కోరుకున్నాడని ఆరోపణలు చేశారు. జగన్ తన రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టాడని విమర్శించారు. […]