కరోనా రక్కసి మహారాష్ట్రను వదలనంటోంది. డెల్టా వేరియంట్‌తో ఇప్పటికే మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ సైతం మహారాష్ట్రలో విజృంభిస్తోంది. అయితే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సిబ్బందితో పాటు అక్కడ విధులు నిర్వహించే పోలీసులకు కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. దీంతో 8 మంది పోలీసులతో సహా మరో ఇద్దరు సిబ్బందికి కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరింత పటిష్టంగా వైద్య పరీక్షలు నిర్వహించి అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాటు చేయనున్నారు.