ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు 11వ పీఆర్సీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సీఎస్ సమీర్‌శర్మ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసి పీఆర్సీపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే సీఎస్ సమీర్ శర్మ కమిటీ 14.29 ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ నివేదకను సమర్పించారు. అయితే ఈ నివేదిక ప్రభుత్వ ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని ఉద్యోగ సంఘాల నేతలు నిరసనలు చేపడుతూనే ఉన్నారు.
అయితే పీఆర్సీసై చర్చించేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలేవి ఫలించలేదు. ఈ క్రమంలో నేడు మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించనున్నారు. సీఎస్ సమీర్ శర్మ ఆధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ఈ క్రమంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సంఘాలకు ప్రభుత్వం భేటీకి ఆహ్వానించింది. ఈ రోజు జరుగునున్న చర్చల్లో పీఆర్సీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.