దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 6,317 కరోనా కేసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఒక్కరోజులో 318 మంది కరోనా సోకి చనిపోయినట్లు తెలిపారు. వీరితో పాటు 3,900 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
దేశంలో ప్రస్తుతం 78,190 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీనితో పాటు దేశంలో 138.95 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసులు పంపిణీ చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లో కూడా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 213కు చేరుకుంది.