Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Ukraine Crisis : ఉక్రెయిన్‌లో తెలంగాణ యువకులు.. ఆందోళనలో తల్లిదండ్రులు..
ఉక్రెయిన్‌లో చోటు చేసుకుంటున్న యుద్ధ పరిస్థితులతో అక్కడికి చదువుకునేందుకు వెళ్లిన తెలంగాణ యువత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్‌లో చదువుకునేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వెళ్లారు. అయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ళ అజయ్ కుమార్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఐదేళ్ల క్రితం ఎంబీబీఎస్ చదివేందుకు అజయ్ కుమార్ ఉక్రెయిన్ వెళ్లాడు. మరో మూడు నెలలు అయితే అజయ్ కుమార్ ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చే వాడు. ఇంత లోనే […] -
JC Prabhakar Reddy : పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఇంకా స్పష్టత నెలకొనలేదు. దీంతో తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్నా సినిమాలపై భారం పడే అవకాశం ఉంది. అయితే ఈనెల 25న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ.. ఏపీలో జీవో 35 ప్రకారమే సినిమా టికెట్లు విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ సినిమాలపై కక్ష సాధింపులకు […] -
Kondanda Reddy : ధరణి పోర్టల్ ఏర్పాటులో పెద్ద కుట్ర దాగివుంది
ధరణి పోర్టల్‌లోని లోపాలపై కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిందని, కానీ కాంగ్రెస్ సూచనలను, సలహాలను కేసీఆర్ పట్టించుకోలేదని ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరణిలో లోపాలను సరిచేసేందుకు హరీష్ రావు కమిటీ కేవలం కంటి తుడుపు చర్యనేనని ఆయన మండిపడ్డారు. హరీష్ రావు ఎవ్వరితోనూ పూర్తిస్థాయిలో చర్చలు జరపలేదని, గ్రామాల్లో తర తరాలుగా వ్యవసాయం చేసుకునే రైతుల హక్కులను ధరణితో భంగం కలిగిందని ఆయన మండిపడ్డారు. […] -
Minister Prashanth Reddy : ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం
బీజేపీ సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసుకుంటోందని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనీ.. అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి పథకం, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు కింది స్థాయి వరకు చేరేలా ప్రయత్నం చేయాలని కార్యకర్తలకు సూచించారు. లేకుంటే ప్రతి పక్షాలు చేసే అబద్దాలే నిజమని నమ్మే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి.. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు […] -
Kalvakuntla Kavitha : ఏం చేస్తామో అదే చెప్పడం కేసీఆర్ నైజం
నీళ్లు, నిధులకెడ్చిన తెలంగాణ కోసం పట్టుదలతో ముందుకొచ్చిన నేత కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో కేసీఆర్ తెలంగాణ సాధించారని ఆమె అన్నారు. సత్యం చెప్పి ఉద్యమం చేశారు.. నిజం చెబుతూనే రాష్ట్ర అభివృద్ధి చేశారని ఆమె తెలిపారు. ఏం చేస్తామో అదే చెప్పడం కేసీఆర్ నైజమని ఆమె పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలినప్పుడు.. మనం చేసిన అభివృద్ధి పనులను చెప్పి సమాధానం ఇవ్వాలని […] -
Medaram Jatara : సమ్మక్క-సారక్క హుండీ ఆదాయం ఎంతో తెలుసా..
తెలంగాణాకే తలమానికమైన మేడారం సమ్మక్క-సార్క జాతర ఈ ఏడాది వైభవోపేతంగా జరిగింది. సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ నెల 16 నుంచి 19 వరకు మేడారం జాతర కన్నుల పండువగా సాగింది. అయితే మేడారం జాతర హుండీల లెక్కింపును బుధవారం ప్రారంభించారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 497 హుండీల్లో ఇప్పటివరకు […] -
Mallanna Sagar : గోదావరి జలాలతో మల్లన్నకు అభిషేకం
తొగుట మండలం తుక్కాపూర్‌లో బుధవారం మల్లన్న సాగర్ ప్రాజెక్టు పంపుసెట్లను స్విచాన్ చేసి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. అనంతరం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించి గోదావరి జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ మల్లన్న సాగర్‌ను పూర్తి చేసిన అనంతరం కొమురవెల్లి ఆలయ పీఠాధిపతికి అభిషేకం నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. తన వాగ్దానాన్ని విమోచించడానికి, చంద్రశేఖర్ రావు అభిషేకం చేయడానికి మల్లన్న సాగర్ నుండి […] -
Ukraine Crisis : ఉక్రెయిన్‌లోని రష్యా రాయబార కార్యాలయం ఖాళీ
ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొద్దిరోజులుగా చోటు చేసుకుంటూ వస్తోన్న ఘర్షణ వైఖరి రోజురోజుకూ మరింత తీవ్రరూపాన్ని దాల్చుతోంది. సరిహద్దులకు పెద్దఎత్తున తన సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని తరలించింది రష్యా. రెండు లక్షల మందికి పైగా సైన్యాన్ని చేరవేసింది. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి అగ్రరాజ్యం అమెరికా చేస్తోన్న ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించట్లేదు. ఈ నేపథ్యంలో కైవ్‌లోని తన రాయబార కార్యాలయాన్ని రష్యా ఖాళీ చేయడం ప్రారంభించింది. బుధవారం మధ్యాహ్నం నాటికి, […] -
A Burnt truth: ‘కిరోసిన్’ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్
కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ లో ఏ మాత్రం కొత్తదనం ఉన్నా నటీనటుల గురించిన ఆలోచన చేయకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే నూతన నటీనటులు వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. అలాంటి చిత్రమే ‘కిరోసిన్’. గతంలో తెరపై రాని ఓ సరికొత్త క్రైమ్ థిల్లర్ కథను తయారు చేసుకున్న ధృవ తానే స్క్రీన్ ప్లే, మాటలు రాసుకుని ప్రధాన పాత్రనూ ఇందులో పోషించారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ […] -
Dharmapuri Arvind : పసుపు పంటపై.. నేను లేఖ రాసిన స్పందించలేదు..
నిజామాబాద్ మార్కెట్లో ఈ రోజు పసుపు పంటకు క్వింటాల్ కు 10 వేల రూపాయలు ధర పలికిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది పడ్డ అకాల, అతి వర్షాలకు పసుపు పంట చాలా వరకు దెబ్బతిన్నదని ఆయన అన్నారు. పంట కుళ్లి పోయిన రైతులు చాలా వరకూ నష్టపోయారని, అలాంటి పంట తక్కువ ధర పలుకుతుందని, అలాంటి రైతులను ఆదుకోవాలని ఇప్పటికే నేను ముఖ్యమంత్రి కి లేఖ రాయడం […]
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్‌లో రో-కో ఆడతారా?
-
Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!