మనకు మామూలుగా పెయింటింగ్ అంటే ముందుగా గుర్తుకువచ్చేది పికాసో. ఎందుకంటే పెయింటింగ్స్‌లో ఆయన అంత ప్రావీణ్యం కలవాడు కాబట్టి. అయితే పందుల్లో కూడా పెయింటింగ్స్‌లో ప్రావీణ్యం కలిగిన ఓ పంది ఉంది. దానిపేరే పిగ్‌కాసో. సౌతాఫ్రికాలో ఉంటున్న ఈ పందిని చిన్నప్పుడే తన యజమాని ఓ మటన్ షాపుకు అమ్మేశాడు. అయితే ఆ మటన్‌షాపు యజమాని దీనిని వధించి వంటకు వాడాలనుకున్నాడు. కానీ.. అంతలోనే సౌతాఫ్రికాలోని పశ్చిమ కేఫ్ ప్రాంతానికి చెందిన జువానే లెఫ్‌సన్ అనే మహిళ స్థానికంగా ఫాం ఓ నిర్వహిస్తోంది.
ఆ ఫాంలో వివిధ ప్రమాదాల నుంచి రక్షించబడిన జంతువులను పోషిస్తుంటుంది. అయితే జువానే లెఫ్‌సన్ ఆ పందిని రక్షించి తన ఫాంకు తీసుకువచ్చింది. ఈ పంది ఓసారి నోట్లో బ్రెష్ పెట్టుకొని విన్యాసాలు చేస్తుండగా చూసిన జువానేకు ఓ ఆలోచన వచ్చింది. దీని ముందు వైట్ కాన్వాసు పెడితే ఎలా ఉంటుంది ఏం చేస్తుందని.. అయితే ఆమె ఆలోచనతో ఆ పంది నోట్లో ఓ బ్రెష్ పెట్టి కాన్వాసు ముందు నిలబెట్టింది. ఇంకేముందు ఈ వరాహం.. వడివడిగా పెయింటింగ్ వేసేసరికి జువేనా ఒక్కింత ఆశ్చర్యంతో పాటు ఆనందానికి లోనైంది.
అయితే ఈ పంది పెయింటింగ్‌లను జువానే ఆన్‌లైన్ పెట్టడంతో జంతు ప్రేమికులతో పాటు మరికొందరు ఆసక్తి ఈ పెయింటింగ్‌లను కొనడానికి ఎగబడ్డారు. దీంతో ఈ వరాహం వేసిన పెయింటింగ్‌లు వేలంపాట వేసి మరి అమ్ముతున్నారు. అయితే తాజాగా ఈ పిగ్‌కాసో గీసిన పెయింటింగ్ ధర రూ. 2 లక్షలకు అమ్ముడుపోయింది. ఈ పిగ్ కాసో గీసిన మరో పెయింటింగ్ గతంలో రూ.20 లక్షలకు అమ్ముడు పోవడం విశేషం.