జగనన్న తోడు నిధులు ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జమ చేయనున్నారు.తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు జగన్ సర్కార్ జగనన్న తోడు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే 2020 నవంబర్ నుండి 2021 సెప్టెంబర్ వరకు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన లబ్దిదారులకు ఈ ప్రయోజనం అందనుంది. ఈ పథకం వల్ల 4,50,546 మంది చిరు వ్యాపారస్తులు […]
రోజురోజుకు ప్రజల మానసిక స్థితి ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి సంఘటనే ఇది.. హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీకి చెందిన ఓ మహిళ తన తండ్రి మందలించడంతో ఉసురుతీసుకుంది. మమత అనే మహిళ తన తల్లిదండ్రులతో కేపీహెచ్ బీ కాలనీలో నివాసం ఉంటోంది. మమత కు 2019 వివాహం జరిగింది. అయితే భర్తకు కాన్సర్ ఉందని తెలియడంతో రెండు నెలలకే విడాకులు […]
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగి సామాన్యుల జేబులకు చిల్లులు వేయడానికి రెడీ అయిపోయాయి. రెండు రోజుల స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడంతో వాహనదారులు షాక్ కు గురయ్యారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమని వాహనదారులు అంటున్నారు. బుధవారం పెట్రోల్ పై 37 పైసల పెంపుతో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46 లకు చేరుకుంది. ఇక డీజిల్ పై 38 పైసలు పెంచగా […]
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయం హీట్ ఎక్కుతోంది. మంగళవారం హుజురాబాద్ లో ఈటలకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన మాజీ ఎంపీ వివేక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్, హరీష్ రావు ల స్నేహం మధ్య చిచ్చు పెట్టింది కేటీఆర్ అని, ఓటమి భయంతో ఏదో ఒకటి చెప్పాలని కేటీఆర్ చెప్తున్నారన్నారు. సుమన్ భాష మార్చుకోవాలి మొనగాడు ఎవరో సీఎం కేసీఆర్ ను అడిగితే చెప్తాడన్నారు. మేము కాంగ్రెస్ లో ఎందుకు పోతం బీజేపీ బలోపేతానికి […]
హుజురాబాద్ ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారాల్లో వేగం, వేడి పెరుగుతోంది. మంగళవారం హుజురాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ లో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద పెద్ద స్కీంలకు ఇందిరానగర్- శాలపల్లి కేంద్రంగా మారిందన్నారు. శాలపల్లిలో దళితబంధు ఆరంభించి 65-66 రోజులైందని, ఈ స్కీం మొదటి ఇక్కడే లాంఛ్ చేయలేదని, భువనగిరి జిల్లా వాసాలమర్రిలో ప్రారంభించారని గుర్తు చేశారు. దళితబంధు నేను వద్దన్నట్లు దొంగ ఉత్తరం […]
మరో పది రోజుల్లో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికలకు రంగం సిద్ధం అవుతున్న వేళ మాజీ బీజేపీ ఎంపీ తన పదవికి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ బాబుల్ సుప్రియో బీజేపీని వీడి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరిన విషయం తెలిసిందే. అయితే బీజేపీని వీడిన ఎంపీ బాబుల్ సుప్రియో నెల రోజుల తరువాత తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ఆ రెండు విషయాల గురించి నోరుమెదపడం లేదని, దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, లడఖ్ లోని భారత భూభాగాన్ని చైనా అక్రమించిన విషయాలపై ఎందుకు మాట్లాడడం లేదంటూ నిప్పులు చెరిగారు. కశ్మీర్ లో మన భారత సైనికులు ఉగ్రవాదుల చేతిలో చనిపోతుంటే.. పాకిస్థాన్ తో ఈ నెల 24న టీ20 క్రికెట్ […]
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ లో జర్నలిస్టులతో కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ఉద్ఘాటించారు. అంతేకాకుండా బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకై హుజురాబాద్ లో రాజకీయం చేస్తున్నాయన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోవాలని […]
రాజేంద్రనగర్ చింతల్ మేట్ లో దారుణం చోటు చేసుకుంది. చింతల్ మేట్‌కు చెందిన యాదమ్మకు నందిని మూడవ కుమార్తె. అయితే నందినికి గత సంవత్సరం చోటు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వీరి పరిచయం గురించి తెలిసిన యాదమ్మ కూతురు నందినిని చోటుతో తిరుగవద్దని పలుమార్లు మందలించింది. ఈ కమ్రంలో సోమవారం మధ్యాహ్నం తల్లికి తెలియకుండా చోటును నందిని ఇంటికి పిలిపించింది. ఇంటికి వచ్చిన తల్లి యాదమ్మ ఇంట్లో చోటు, నందినిలను చూసి కోపానికి గురైంది. దీంతో […]
ఆస్తి కోసం కన్న తండ్రినే టెక్నాలజీ వాడి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు ఓ కొడుకు, కోడలు. హైదరాబాద్ లో ఉంటూ కరీంనగర్ లో ఉన్న సొంత ఇంటికి కన్నం వేసేందుకు కొడుకు రవి తన భార్యతో కలిసి ప్లాన్ వేశారు. ఇందుకు తండ్రి వైకుంఠం ఫోన్ లో కాల్ రికార్డింగ్ అనే యాప్‌ను ఇన్స్టాల్ చేసి తన జీమెయిల్ అకౌంట్‌కు జత చేసుకున్నాడు రవి. ఈ క్రమంలో తండ్రి ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నాడు, డబ్బులు, ఆస్తికి సంబంధించిన […]