పెరల్స్ చిట్‌ఫండ్ స్కాం కేసులో సీబీఐ 11 మందిని అరెస్ట్ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 11 మందిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 5 కోట్ల మంది ఖాతాదారుల నుంచి రూ.60 వేల కోట్లు వసూలు చేసి మోసం చేసిందని గతంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో పెరల్స్ చైర్మన్ చంద్రభూషణ్, ప్రేమ్ సేత్‌తో పాటు మరో 9 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. 2014లో పీజీఎఫ్‌తో పాటు పెరల్స్ గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.
దేశవ్యాప్తంగా పెరల్స్ సంస్థలు, ఎండీల ఇళ్లలో సీబీఐ సోదాలు కూడా చేసింది. లక్షలాది మంది పెట్టుబడిదారుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభావితం చేసిన కోట్లాది రూపాయాల ఆర్ధిక కుంభకోణంలో ఇతర నిందితులు, అనుమానితుల పాత్రను పరిశోధించడానికి ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సీబీఐ ప్రతినిధి ఆర్‌సీ జోషీ తెలిపారు.