టీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి వీసీ సజ్జనార్ ఆర్టీసీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. కొత్తకొత్త ఆలోచనలతో ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపేందకు కృషి చేస్తున్నారు. అయితే సజ్జనార్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళ కండక్టర్‌లకు రాత్రి 8 గంటల వరకే డ్యూటీలు వేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి 8 గంటలలోపే వారి డిపోలకు చేరుకునేలా డ్యూటీలు వేయాలని సూచించారు.
అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు ఈ దేశాలను పాటించాలన్నారు. ఒకవేళ రాత్రి 8 గంటలు దాటిన తరువాత డ్యూటీ వేయాల్సి వస్తే కారణాన్ని హెడ్ ఆఫీస్‌కు తెలియజేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే వినూత్న కార్యక్రమాలతో సజ్జనార్ ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
All the DM's, DVM's & RM's
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 23, 2021
Please adhere Strictly. pic.twitter.com/joDxhog95p