నేడు రెండో రోజు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ రోజు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించనున్నారు. అనంతరం పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
నిన్న తిరుపతి చేరుకున్న శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే నేడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం తిరిగి శ్రీలంకకు వెళ్లనున్నారు.
ఈ రోజు ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జనవరి నెల టికెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది.
నేటి నుంచి మూడ్రోజుల పాటు సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. చివరగా రెండేళ్ల క్రితం సొంతూరు పొన్నవరంకు వచ్చిన జస్టిస్ రమణ, సీజేఐ హోదాలో తొలిసారి సొంతూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో సొంతూరు పొన్నవరంలో సుమారు 4 గంటలపాటు గడపనున్నారు.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,480లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,350లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,200లుగా ఉంది.