తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన రైతుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.
తెలంగాణ రాష్ట్ర పోలీసులు మావోయిస్టులకు గట్టి షాక్ ఇచ్చారు. మావోయిస్టు ఉద్యమంలో కీలక స్థానంలో ఉన్న ఇద్దరు ముఖ్య వ్యక్తులు తాజాగా పోలీసుల వలలో చిక్కారు. అందులో రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునీత ఒకరు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిషేధ నిర్ణయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హర్షించారు. ఇప్పటికే ఈ యాప్స్ కారణంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది అమాయకులు మోసపోయారని, ఆర్థికంగా కూలిపోయారని గుర్తుచేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వచ్చే ఏడాది ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ రూ.150 కోట్లు మంజూరు చేసింది.
భారీ వర్షాల కారణంగా ముంబై వరద ముంపులో కూరుకుపోయింది. రోడ్లు, ఇళ్లు నీటమునిగిపోయి నగరం మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భంలో, సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కనిపించిన ఇద్దరు వ్యక్తులు మాత్రం పూర్తిగా కూల్ మూడ్ లో ఉండటమే కాకుండా, అందరినీ ఆశ్చర్యపరిచారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత రెండు నెలలు గా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణ బీజేపీ కిటకిటలాడుతోందా? పోస్ట్‌ల కోసం నాయకులు పోటీలు పడుతున్నారా? నాక్కావాలంటే నాకంటూ..... మూడు పదవుల కోసం 30 మంది నాయకులు రేస్‌లోకి వచ్చారా? పార్టీలో ఒక్కసారిగా అంత గిరాకీ ఎందుకు పెరిగింది? అసలు ఏ పోస్ట్ కోసం ఆ స్థాయిలో రేస్ మొదలైంది?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మార్వాడీలపై జరుగుతున్న ఆరోపణలకు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మార్వడి గో బ్యాక్ అనేది అర్బన్ నక్సలైట్ల కుట్ర మాత్రమే” అని ఆయన పేర్కొన్నారు. రాజాసింగ్ మాట్లాడుతూ, గతంలో కోమటీలపై కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేశారు.
ఆ ఉమ్మడి జిల్లాలో గులాబీ వాడుతోందా? బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్ధకమవుతోందా? అధికారంలో ఉన్నప్పుడే అంతంతమాత్రంగా ఉన్న వ్యవహారం ఇప్పుడు మరింత దిగజారిందా? పెద్దోళ్ళు నోళ్ళు విప్పడం లేదు, ఉన్నవాళ్ళ స్థాయి సరిపోక కేడర్ కూడా పక్క చూపులు చూస్తోందా? ఎక్కడ ఉందా పరిస్థితి? ఎందుకలా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ని ఎప్పుడూ నాయకత్వ లోపం వెంటాడుతూనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడు అదే పరిస్థితి. కాకుంటే… చేతిలో పవర్ ఉన్నప్పుడు కవరైన కొన్ని లోపాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. […]
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ పరిధి రోడ్ నెంబర్ వన్ లో ఘర్షణాత్మక సంఘటన చోటుచేసుకుంది. వ్యభిచారిణి రవళి, సాఫ్ట్వేర్ ఉద్యోగి మధు గౌడ్ మధ్య వివాదం దారుణ ఘటనకు దారితీసింది. సమాచారం ప్రకారం, రవళిని బుక్ చేసుకునే క్రమంలో మధు గౌడ్‌తో వాగ్వాదం జరిగింది.