CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం నివాసంలో జరగనున్న ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ భేటీ ఏర్పాటు చేశారు. సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి వివేక్ వేంకటస్వామి హాజరుకానున్నారని సమాచారం. పార్టీ అభ్యర్థి ఎంపిక, ఎన్నికల ప్రచారం, స్థానిక నేతల సమన్వయం వంటి అంశాలపై ముఖ్యమంత్రి నేతృత్వంలో స్పష్టమైన దిశానిర్దేశం ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Hyderabad : హైదరాబాద్ లో దారుణం మూడేళ్ల కొడుకును చంపి మూసీలో పడేసిన తండ్రి