Arunachalam : అరుణాచలంలో అనుమానాస్పద మృతి.. నవీన్ ది హత్యా? ఆత్మహత్యా?
- నవీన్ అనే యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి
- అరుణాచలంలో జరిగిన ఘటన
- పరువు కోసం హత్య చేశారనే ఆరోపణలు
- మాజీ సర్పంచ్ కూతురును ప్రేమించిన నవీన్
- ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు తోసేసి దారుణంగా హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arunachalam : అనకాపల్లి జిల్లాలో పరువు హత్య జరిగిందా? కులమతాలకు అతీతంగా నడిచిన ప్రేమ వ్యవహారం చివరకు హత్యకు దారి తీసిందా? తమతో పాటే యువకున్ని తీసుకెళ్లిన తల్లి, బిడ్డ అతన్ని ఏం చేశారు? ప్రేమించిన యువకుడు ఎలా చనిపోయాడు? ఆత్మహత్య చేసుకున్నాడా? హత్య చేశారా? అసలు అరుణాచలంలో ఏం జరిగింది? అనకాపల్లి జిల్లాలో పరువు హత్య ఓ గ్రామాన్ని విషాదంలో నింపింది. రాంబిల్లి మండలం వెంకటాపురానికి చెందిన యువకుడు నవీన్.. అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ప్రియురాలు, ఆమె తల్లితో కలిసి అరుణాచలం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ప్రియురాలి కుటుంబ సభ్యులే తమ పరువు కోసం హత్య చేసి ఉంటారని నవీన్.. కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా నవీన్ మృతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి..
Anil Sunkara : భోళా శంకర్.. చిరంజీవిని బ్లేమ్ చేయడానికే అలా చేశారు..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
వెంకటాపురం మాజీ సర్పంచ్ కూతురును నవీన్ ప్రేమించాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య కులచిచ్చు రేగింది. దీంతో ఇద్దరి ప్రేమను అంగీకరించలేదు. ఐతే ప్రియురాలి తల్లి చిన్నమ్ములు ఇద్దరినీ అరుణాచలంకు తీసుకు వెళ్లింది. అక్కడ ఓ లాడ్జిలో బంధించి.. అతనిపై తీవ్రంగా దాడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగానే చిన్నమ్ములు సుఫారీ.. ఇచ్చి తీసుకుని వెళ్లిన గ్యాంగ్‌తో నవీన్ గొంతు కోసి ఆ తరువాత మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేసి అత్యంత దారుణంగా హతమార్చారని చెబుతున్నారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఓ నాటకానికి తెర లేపారంటున్నారు. కానీ నవీన్ ఒంటిపై గాయాలు చూసిన పోలీసులకు బంధువులకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి..
నవీన్ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నైలోని కే -10 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చేతికి అందిన కొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. నిజంగా ప్రేమించుకుంటే ఆ విషయాన్ని తనకి చెప్పినట్లయితే తన కుమారుడిని ఆ ప్రేమకు దూరం పెట్టే వారమంటున్నారు తల్లితండ్రులు. ప్రేమిస్తే చంపేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాఫ్తు చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మృతికి కారణమైన వారిని కటినంగా శిక్షించాలని కోరుతున్నారు…
Vijay: బీజేపీ, డీఎంకేలను వదిలిపెట్టం, దళపతి విజయ్ వార్నింగ్..
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!