Onion Price: ఏపీలో ఇటీవల కురుస్తున్న వర్షాలు ఉల్లి రైతుల పరిస్థితిపై నేరుగా ప్రభావం చూపాయి. కర్నూలు, కడప జిల్లాల్లో ఉల్లి పంట బాగా పండినా, గిట్టుబాటు ధరలు లేకపోవడం రైతుల ఆందోళనను పెంచింది. సాధారణంగా ఈ రెండు జిల్లాల్లోని ఉల్లిపాయలను పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్‌కి తరలించి అమ్మడం జరుగుతుంటుంది. అయితే ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉండటం వల్ల రైతులకు భారీ నష్టం ఎదురైంది.
తాజాగా, ఇతర జిల్లాల నుంచి తాడేపల్లిగూడెం మార్కెట్‌కి వచ్చిన ఉల్లిపాయలను కొద్దిరోజులుగా వ్యాపారులు, ట్రేడర్లు కొనుగోలు చేయకపోవడం, ధరలు క్రితం తక్కువ స్థాయిలో ఉండడం రైతుల ఆందోళనను మరింత పెంచింది. మార్కెట్‌లో ఉల్లిపాయల ధరలు సాధారణంగా రూ. 6 కన్నా ఎక్కువ ఉండకపోవడంతో, రైతులు మార్క్ఫెడ్ ద్వారా ఉల్లిపాయలను కొనుగోలు చేసి తాడేపల్లిగూడెంకు పంపే ప్రయత్నం చేశారు.
Tommy Robinson: నేపాల్ దిశగా లండన్.. ఒక్కడి కోసం వేలాదిగా రోడ్లపైకి జనం
అయితే, నిల్వలు పెద్దగా లేవని, కొనుగోలు కోసం ఎవరూ ఆసక్తి చూపలేదని రైతులు గమనించారు. కడప నుంచి ఉల్లిపాయలు తీసుకువచ్చిన రైతులు, తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ డల్‌గా ఉందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లిపాయలను రూ. 5–6కు అమ్మితే, పెట్టుబడి, రవాణా ఖర్చులు వచ్చే సమయంలో పెద్ద నష్టమే ఎదురవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల ప్రకారం, ఒక్క ఎకరా ఉల్లి పంటకు లక్షా 50 వేల నుంచి 70 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ పరిస్థితుల్లో గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, తమకు న్యాయం చేయాలని కడప, కర్నూలు రైతులు అధికారులు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాల ప్రభావం, మార్కెట్ ఆసక్తి లేమి కారణంగా రైతుల ఆర్ధిక పరిస్థితి చాలా కష్టతరంగా మారిన పరిస్థితి ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.