మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణిలో జరిగిన ప్రమాదంపై సింగరేణి సీఎండీ శ్రీధర్ స్పందించారు. ఎస్ఆర్పీ-3,3ఎ ఇంక్లైన్ ప్రమాదంలో కార్మికుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా తక్షణ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అండగా సింగరేణి ఉంటుందని, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబంలో అర్హులైన ఒకరికి కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గని ప్రమాద మృతులకు కంపెనీ […]
ఏపీ శీతాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవనున్నట్లు గవర్నర్ బిష్వభూషణ్ నోటిఫికేషన్ జారీ చేశారు. నాలుగైదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అయితే 18న జరిగే బీఏసీ భేటీలో అసెంబ్లీ పని దినాలు, అజెండా ఖరారు కానున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఏపీ ప్రత్యేక హోదా లతో పాటు పలు కీలక […]
తెలంగాణలో మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాద మోపుతున్నారు. అడుగడునా తనిఖీలు, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం నజీరాబాద్ తండాలో ఓ రైతు పత్తిపంటలో గంజాయి సాగు చేస్తున్నాడు. దీనిని గుర్తించిన పోలీసులు పత్తిపంటలో గంజాయి సాగు చేస్తున్న రైతును అరెస్టు చేశారు. అంతేకాకుండా సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేసి, గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్పాట్ వాల్యుయేషన్ కి స్టాఫ్ ని పంపించని కళాశాలల పై చర్యలు తప్పవని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికీ కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు తమ సిబ్బంది ని పంపించలేదని, పంపించాలని ఆదేశించినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. రిపోర్ట్ చేయని సిబ్బందికి, ప్రైవేట్ కళాశాలలకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. రేపు ఉదయం వరకు సిబ్బందిని రిలీవ్ చేయకున్న, సిబ్బంది రిపోర్ట్ చేయకపోయిన క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. […]
ప్రముఖ సర్చ్ ఇంజన్ గూగుల్‌కు యూరోపియన్ యూనియన్ (ఈయూ) కోర్టు భారీ జరిమానా విధించింది. బ్రసెల్స్‌లో ఐటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ గూగుల్‌కు రూ.20,285 కోట్ల భారీ జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. ఈయూ యాంటీట్రస్ట్ నిబంధనల ప్రకారం గూగుల్ చట్టవిరుద్దంగా ఇతర కంపెనీలకు మెరిట్‌లపై పోటీపడే అవకాశాన్ని, కొత్త ఆవిష్కరణలను నిరాకరించిందని, ముఖ్యంగా ఇది యూరోపియన్ వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు ఎంపిక చేసుకోవడంలో ప్రభావం చూపుతుందని ఈయూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఓ కంపెనీకి […]
దొంగతనం కేసులో పోలీసులు తీసుకెళ్లి కొట్టడంతో పోలీస్ స్టేషన్లోనే మరియమ్మ మృతి చెందింది. అయితే మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో పీయూసీఎల్ పిల్ పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. మరియమ్మ లాకప్ డెత్ సీబీఐకి అప్పగించదగిన కేసని హైకోర్టు అభిప్రాయపడింది. ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా మరియమ్మ మృతిపై […]
ఇటీవల జరిగిన బద్వేల్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ గెలిచారు. బద్వేల్లో గెలుపు అనంతరం మొదటి సారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరుకు బద్వేల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దాసరి సుధకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఆమె వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ […]
సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాను స్పూర్తిగా తీసుకొని సుభాష్‌రెడ్డి అనే వ్యక్తి కామారెడ్డి జిల్లాలోని బీబీపేటలో పాఠశాలను 8 కోట్లతో అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసిన ఈ పాఠశాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతేకాకుండా ఈ పాఠశాలకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్‌బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. త్వరలోనే శ్రీమంతుడు బృందంతో ఈ స్కూలును సందర్శిస్తానని.. అంతేకాకుండా తన సినిమా స్పూర్తితో ఈ పాఠశాల […]
చీటింగ్ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నానక్‌రాంగూడలోని సర్వే నెంబర్ 104లో శ్రీధర్ రావుకు ఐదు ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన అంశంలో మమ్మల్ని మోసం చేశాడంటూ రాయదుర్గం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ భూమి అమ్మకం జరిగినప్పుడు తమకు రావాల్సిన అమౌంట్ ఇవ్వకుండా మోసం చేశాడని, డబ్బులు అడిగితే గన్మెన్లను చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడని, చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. కొందరికి […]
సుశాంత్ రాజ్‌పుత్ అకాల మరణంతో తీవ్ర అరోపణలు ఎదుర్కొంది నటి రియా చక్రవర్తి. కొన్ని రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపింది. అయితే విచారణ సమయంలో రియా చక్రవర్తికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్న అధికారులు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి సినిమాల్లో పాల్గొంటున్న రియా చక్రవర్తి విచారణ సమయంలో స్వాధీనం చేసుకున్న వస్తువులను, బ్యాంక్ ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు […]