పండుగలు వచ్చిదంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యాలు టికెట్ల ధరలను అమాంతంగా పెంచేసి సామాన్యుడు జేబుకు చిల్లుపెడుతుంటాయి. పండుగ సమయాల్లో సుమారు టికెట్ల ధరలో సుమారు 50 శాతం అధికంగా వసూలు చేస్తుంటారు. అయితే అలాంటి ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయవాడలో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో 5 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా విశాఖపట్నంలోని అగనంపూడి టోల్‌గేట్ దగ్గర తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని 13 బస్సులకు జరిమానా విధించారు. దీనితో పాటు గుంటూరు కాజా టోల్‌ప్లాజా దగ్గర ఆర్టీఏ వాహనాల తనిఖీలు కూడా నిర్వహించారు. పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు.