గత కొన్ని రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ క్రీయాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఎంపీ ధర్మపురి శ్రీనివాస్‌ను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కలిశారు. ఉప ఎన్నికల తరువాత తన ఎన్నిక కోసం కృషి చేసినవారిని కలుస్తున్న ఈటల.. అనుహ్యంగా ఎంపీ శ్రీనివాస్‌తో భేటీ అవడంతో.. రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకంగానే జరిందని బీజేపీ వర్గాలు చెబుతున్నా.. అంతర్యమేంటోనని టీఆర్ఎస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. గత కొంత కాలంగా టీఆర్ఎస్కు […]
స్థానిక సంస్థల ఎన్నికల ప్రకియ దుర్మార్గంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడే ఏకగ్రీవాలు పెరిగాయని, బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగిందన్నారు. ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపణలు చేశారు. అభ్యర్థులు కోర్టుకు వెళితే.. మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. రైతులు పాదయాత్ర చేస్తుంటే అక్కడ కూడా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందన్నారు.
సీఎం కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై కేంద్ర శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. కృష్ణ జలాలపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి కారణం తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన వెల్లడించారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. ఈ అంశంపై కేసీఆర్ సర్కార్ వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో ఉన్నందున మేము నిర్ణయం తీసుకోలేమని చెప్పామన్నారు. దీంతో రెండు రోజుల్లో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని తెలిపి.. 8 నెలలకు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారన్నారు. పిటిషన్ […]
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండ చైన్నైలో తీరం దాటింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను సూచించింది. తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో విమానాలను హైదరాబాద్, ముంబై, కోల్‌కత్తాలకు మళ్లిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా తమిళనాడులో 14 మంది మృతి చెందారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు […]
తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కొట్లాట నడుస్తోంది. అటు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని వ్యాఖ్యానించి తెలంగాణ రైతులకు షాక్ ఇచ్చారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతోందని…అందుకే ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలేమో రైతులు ధాన్యాన్ని పండించండి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు […]
ఏపీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో తిరుపతిలో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార పసుపుధార జలాశయాలు నిండుకుండాల మారాయి. దీంతో పాపవినాశనం, గోగర్భం డ్యాం గేట్లను అధికారులు ఎత్తారు. కుమారధార పసుపుధార, ఆకాశగంగ జలశయాల నుంచి ఓవర్ ఫ్లోలో నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతి బస్టాండ్, రైల్వే బ్రిడ్జి నీట మునగడంతో తిరుపతిలో కంట్రోల్ రూంను అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనం […]
పోలీసుల అండతో రైతులపై ప్రభుత్వం కక్షసాధిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద మహాపాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసులు చేసిన లాఠీఛార్జ్ ఘటనపై చినరాజప్ప స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఎంత భయపెట్టినా రాజధాని రైతుల మహాపాదయాత్ర ఆగదని ఆయన స్పష్టం చేశారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతులు ఉన్నా ఖాకీలు ఆంక్షలెందుకు పెట్టారు..? […]
ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని రైతుల మహా పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుందని అన్నారు. రైతుల మహా పాదయాత్ర చూసి సీఎం జగన్ భయపడుతున్నారని సెటైర్లు వేశారు. అందుకే రైతుల పాదయాత్రకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందన్నారు. రైతులు, మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు. రైతుల పాదయాత్ర […]
తెలంగాణ వ్యాప్తంగా మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మరోసారి డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఫోటోస్ ఫ్రేమ్ వెనుక డ్రగ్స్ పెట్టి పార్శిల్స్ చేసి సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బేగంపేటలో ఇంటర్ నేషనల్ పార్శిల్స్ ఆఫీసులో పోలీసులు తనిఖీలు చేయగా 14 కిలలో డ్రగ్స్ లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 5.5 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు ఈ […]