పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణపురం నుంచి దువ్వాడకు చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ తాడేపల్లిగూడెం వద్ద బోల్తా కొట్టింది. లారీ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు మరో 6గురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై లారీ బోల్తా కొట్టడంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.