దేశానికి వెన్నెముక రైతన్న.. రైతులకు పెద్దపీట అంటూ ఎన్నికల్లో వాగ్దానం చేయడం …గద్దెనెక్కాక దేశానికే వెన్నెముక అయిన రైతు వెన్నెముక విరిచేయడం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. స్వతంత్రం వచ్చిననాటి నుంచి రైతన్న పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన పార్టీలేగాని రైతన్నకు పేరుతెచ్చిన దాఖలాలు లేవు. దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా మట్టిని నమ్ముకున్న రైతులు ఆఖరికి ఆ మట్టిలోనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని చెప్పడంలో ఆతిశయోక్తి లేదు. గత ఎన్నికల్లో రైతులను సంపన్నులను […]
బ్రదర్ ఆఫ్ దేవరకొండ (ఆనంద్ దేవరకొండ).. న్యూ మూవీ ‘పుష్పక విమానం’. దొరసాని సినిమాతో కథనాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు ఆనంద్ దేవరకొండ. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సొదరుడైనా కూడా.. తన దైన నటనా శైలితో ముందుకు వెళుతున్నారు. దొరసాని సినిమా తరువాత ఆనంద్ నటించిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్.. ఈ సినిమా కరోనా లాక్డౌన్ కారణంగా ఓటీటీలో విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా ఓటీటీలో మంచి విజయాన్నే సాధించింది. […]
ఇంటర్నేషనల్ మార్కెట్లో జరిగే పరిణామాలతో డాలర్ విలువ మారుతూ ఉంటుంది. దాని ప్రభావం వల్ల భారతదేశం, పాకిస్థాన్‌తో పాటు చాలా దేశాల డబ్బుల విలువలు మారుతుంటాయి. అయితే ప్రతి రోజు అమెరికా ఒక్క డాలర్‌కి ఇండియన్ రూపీ విలువ ఎంతుందో తెలుసుకోవాలనే అతృత అందిరికీ ఉంటుంది. ప్రస్తుత్తం అమెరికా ఒక్క డాలర్‌కు విలువ ఇండియాలో రూ.74.42 పైసలు ఉంది. ఇదిలా ఉంటే.. పక్కనే ఉన్న పాకిస్థాన్‌లో ఎంతుందో తెలుసా.. ఒక్క డాలర్‌కు ఏకంగా రూ.174.22 పైసలు పలుకుతోంది. […]
ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన కరోనా… ఏపీలో తగ్గుముఖం పడుతోంది. తాజాగా 33,362 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 262 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. అయితే గడిచిన 24 గంటల్లో కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించినట్లు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. దీనితో పాటు 229 మంది కరోనా నుంచి కొలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 20,69,614 మందికి కరోనా వైరస్ బారిన పడగా, 20,51,976 మంది కరోనా నుంచి కోలుకున్నారు. […]
ఎన్ని విమర్శలు, ఆరోపణల మధ్య బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైంది. ఈ సీజన్ కూడా హోస్ట్‌గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ మొదట్ల కాస్త అటుఇటుగా అనుపించినా రానురాను రసవత్తరంగా మారింది. వారం వారం ఎలిమినేషన్లతో బిగ్ బాస్ హౌస్ వేడెక్కింది. టాస్క్‌లు డ్రామాల మధ్య సాగుతున్న బిగ్ బాస్ 5.. మరోసారి ప్రేక్షకులను అలరిస్తోందనే చెప్పాలి. అయితే బిగ్ బాస్ ప్రేమికులందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే.. ఈ సారి బిగ్ బాస్ సీజన్ […]
ధాన్యం కొనుగోలుపై తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో టీఆర్ఎస్ నేతలు నిర్వహించిన ధర్నాలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వైఖరి తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. అప్పుడు తెలంగాణ కోసం ఉద్యమిస్తే.. ఇప్పుడు రైతుల కోసం ఉద్యమించాల్సి వస్తోందన్నారు. జై కిసాన్ నినాదాన్ని.. నై కిసాన్ గా కేంద్ర ప్రభుత్వం మార్చిందన్నారు. రా రైస్ అంటూ బీజేపీ నేతలు తేలివిగా మాట్లాడుతున్నారని.. […]
తెలంగాణ ధాన్యం కొనుగోలు రచ్చ జరుగుతోంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ అధికారంలో ఉన్న టీఆర్స్ నేతలే రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు. ఇక తెలంగాణ బీజేపీ నేతలేమో రాష్ట్రానికి ధాన్యం కొనుగోలు చేతకాక కల్లబొల్లి కబుర్లు చెబుతోందని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనాల్సిన వాళ్ళే రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారని, మీకు చేత కాక చేతులు ఎతేశరా..? మాకు రాష్ట్ర పాలన చేత […]
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు టీర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ధర్న నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలును కేంద్రం అపొద్దన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం శీతకన్న ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని.. తెలంగాణ రైతు సమితి అంటూ.. టీఆర్ఎస్ […]
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కర్కర్దుమా మెట్రో స్టేషన్ సమీపంలో గల రిషబ్ టవర్లోని 6వ అంతస్థులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు 14 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఇప్పటికే కాలుష్యపు పొగమంచుతో నిండిన ఢిల్లీలో ఈ ఘటనతో మరింత పొగ అలుముకుంది.
హైదరాబాద్‌లో ఓ యువతి అదృశ్యమైన సంఘటన చోటు చేసుకుంది. దోమలగూడ లో నివాసముంటున్న భార్గవి అనే యువతి నిన్నటి నుంచి కనిపించకుండా పోయింది. నిన్న బ్యూటీ పార్లర్ కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన భార్గవి తిరిగి రాలేదు. దీంతో నిన్నటి నుంచి కుటుంబీకులు భార్గవి కోసం తెలిసిన వాళ్ల దగ్గర, బంధువుల ఇండ్లలో వెతికినా ఫలితం లేకుండాపోయింది. అయితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్న భార్గవికి సంవత్సరం క్రితమే వివాహమైంది. భార్గవి ఆచూకీ తెలియకపోవడంతో […]