ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్ల ధరలపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న సినిమా థియేటర్లను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి పేర్ని నాని సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసారం వీక్షించేందుకు క్రింద […]
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకు గ్రామల నుంచి పట్టణాల వరకు అన్ని చోట్ల రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పూట పొగమంచు కారణంగా రోడ్లపై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వెళ్లే వారికే కాకుండా విమానాల రాకపోకలకు సైతం ఇబ్బంది నెలకొంది. తాజాగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఈ రోజు ఉదయం ఎయిర్ఇండియా సంస్థకు చెందిన ఓ విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే ల్యాండింగ్ సమయంలో గన్నవరం ఎయిర్పోర్ట్ రన్‌పై […]
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు 11వ పీఆర్సీపై అమలు చేయాలని కోరుతూ నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సీఎస్ సమీర్ శర్మ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి పీఆర్సీపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో సీఎస్ సమీర్ శర్మ 14.29 ఫిట్మెంట్తో పీఆర్సీ నివేదికను సీఎం జగన్‌కు అందజేశారు. అయితే సీఎస్ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టడంతో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌లు పలుమార్లు ఉద్యోగ సంఘాలతో పీఆర్సీపై […]
ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే 20 రాష్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ ప్రజలపై విరుచుకుపడుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 135 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఆయా ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 600 దాటింది. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 12 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 56కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 63 ఒమిక్రాన్ […]
గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దాని ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే ఖండతరాలు దాటి పలు దేశాల్లో విజృంభిస్తోంది. యూకే, యూఎస్‌లో ఒమిక్రాన్ ప్రభావం అధికంగా ఉంది. అయితే భారత్‌లో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గోవాలో 8 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్‌గా సోకింది. ఈ నెల 17న బాలుడు యూకే నుంచి వచ్చాడు. అయితే యూకే ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహించిన కరోనా టెస్టుల్లో కరోనా నెగిటివ్‌గా తేలింది. దీంతో ఇండియాకు […]
కరోనా రక్కసి కొత్తకొత్త రూపాలతో ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. ఈ వేరియంట్ భారత్‌లో కూడా దాని ప్రభావాన్ని చూపుతోంది. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు, ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఒమిక్రాన్ కేసు సంఖ్య 600లకు చేరింది. దేశంలో ఒమిక్రాన్ 19 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాప్తిచెందుతోంది. ఈ […]
ఏపీ టికెట్ల ధరల తగ్గింపు విషయం చినికిచినికి గాలివానలా తయారైంది. ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు, సినిమా థియేటర్లు మూసివేత పరిణామాలతో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ప్రభుత్వం జీవో 35 ప్రవేశపెట్టి సినిమా టికెట్ల ధరలు అన్ని సినిమాలకు ఒకే విధంగా ఉండేలా నిర్ణయం తీసుకుంది. దీంతో పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టి జీవో 35ను రద్దు […]
ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఎగ్జిబిషన్ (నూమాయిష్) ఈ సారి ఏర్పాటు చేస్తారో లేదోనని ఉత్కంఠ నెలకొంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నెలన్నర రోజుల పాటు అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన కనువిందుగా సాగుతుంది. హైదరాబాద్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ ముత్యాల నుండి మైసూర్ శాలువాల వరకూ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అయితే ఈ సంవత్సరం కరోనా కొత్త వేరియంట్ […]
నేడు ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం కాన్పూర్ స్నాతకోత్సవంలో మోడీ పాల్గొంటారు. నేడు హర్యానా కేబినెట్ విస్తరణ చేయనున్నారు. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నూతన మంత్రుల ప్రమాణస్వీకారం జరుగనుంది. నేడు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఆయిల్ ఫామ్ బిజినెస్ సమ్మిట్ జరుగనుంది. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన జరుగనున్న ఈ ఆయిల్ ఫామ్ సమ్మిట్ కు 9 […]
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. నిరుద్యోగ దీక్ష అంటూ బీజేపీ చీప్ బండి సంజయ్ దీక్ష చేపడుతుంటే.. రచ్చబండ అంటూ కాంగ్రెస్ ఓ కార్యక్రమం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో మాజీ పీసీసీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. దేశానికి రాజీవ్‌గాంధీ సేవలు మరవలేనివని, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ పాలనలో బందీ అయ్యిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు కేసీఆర్‌ను తుక్కుతుక్కు ఓడిస్తారని ఆయన […]