కరోనాతో ఇండియా మొత్తం ఒక్కసారిగా పాపులర్ అయిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు ఇటీవల నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఒమిక్రాన్‌కు ఆయుర్వేద మందు అంటూ మీరు పంపిణీ చేసేందుకు ఎలాంటి అనుమతులు ఉన్నాయో చెప్పాలంటూ జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆనందయ్య నేను ఒమిక్రాన్ కోసం మందు అని చెప్పలేదని అన్నారు. అంతేకాకుండా తన మందు ఏ జబ్బుకైనా ఇమ్యూనిటిని మాత్రమే పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు. […]
ఎన్ని కఠిన ఆంక్షలు విధించిన, చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని శిక్షలు పడుతున్నాకానీ కొందరు మారడం లేదు. వారి జల్సాల కోసం మరొకరి ప్రాణాలు తీస్తూ నిందితులుగా మారుతున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయవద్దంటూ ప్రభుత్వాలు, పోలీసులు చెబుతున్నా పెడచెవిన పెడుతూ ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నారు. అలాంటి ఘటనే ఘట్కేసర్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి నిఖిల్‌రెడ్డి మద్యం సేవించి అతి వేగంగా కారు నడుపుతూ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ […]
ఏపీ ప్రభుత్వం నిన్న ఇళ్ల పట్టాలతో సహా 16 సంక్షేమ పథకాల అర్హులై లబ్దిపొందని వారికి వారి ఖాతాలలో నగుదను జమ చేసింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధిని పొందని 18.48 లక్షల మంది ఖాతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. అయితే నిన్న ప్రభుత్వం జమ చేసిన నగదు, ఇతర సంక్షేమ పథకాలు అందని అర్హులెవరైనా ఉంటే వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం జగన్ వెల్లడించారు. అయితే […]
చౌటుప్పల్‌లో ఆగి ఉన్న ఓ ఎరువుల లారీ అపహరించిన ఘటన చోటు చేసుకుంది. చౌటుప్పల్‌లోని ఓ ఎరువుల దుకాణానికి ఓ లారీ డ్రైవర్ లారీలో ఎరువుల లోట్ తీసుకువచ్చాడు. ఎరువుల దుకాణం చిరునామా దొరకకపోవడంతో చిరునామా కోసం లారీ నుంచి కిందకు దిగాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు యూరియా బస్తాల లోడ్‌తో ఉన్న లారీని చోరీ చేశారు. డ్రైవర్ దిగడాన్ని గమనించి లారీతో ఉడాయించారు. దీంతో ఖంగుతిన్న లారీ డ్రైవర్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ […]
సీఎం కేసీఆర్ నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. అయితే ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం కేసీఆర్ ఈ రోజు నల్గొండ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య చిత్రపటం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం భోజనం తరువాత సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుంచి […]
ఇటీవల వంగవీటి రాధా తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకు ప్రభుత్వం భద్రత కల్పించనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాసారు. వంగవీటి రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరుపాలని చంద్రబాబు కోరారు. దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున నటించిన పుష్ప సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు పుష్ప సినిమా పోస్టర్ చూసాను, ఆ సినిమాను నేను చూస్తాను.. ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి పుష్ప సినిమాలో చూపించారు. ఆ సినిమాలో విధంగా ఏపీలోనూ జరుగుతోందని ఆయన అన్నారు. […]
సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంగారం కోసం వెళ్లిన జనం ఒక్కసారి బంగారం గని కూలిపోవడంతో 38 మంది మృతి చెందినట్లు సూడాన్ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ వెల్లడించింది. సూడాన్ రాజధాని ఖార్టోమ్‌కు 700 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గత కొంత కాలం క్రితమే సూడాన్ ప్రభుత్వం ఈ బంగారం గనిని మూసివేసింది. బంగారం కోసం స్థానిక ప్రజలు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సూడాన్‌లో […]
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌ను గజగజలాడిస్తోంది. ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తూ ప్రజలపై విరుచుకుపడుతోంది. భారత్‌లో కొత్తగా 127 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో ఒమిక్రాన్ కేసుల సంఖ్య దేశంలో 781కు చేరుకుంది. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 23 రాష్ట్రాలకు విస్తరించింది. మహారాష్ట్రలో 167 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 238, కేరళలో 57, గుజరాత్లో 49, పుదుచ్చేరిలో కొత్తగా 2 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే […]
నేడు కృష్ణా జిల్లాలో ‘జగనన్న పాలవెల్లువ’ పథకం ప్రారంభం కానుంది. వర్చువల్‌గా సీఎం జగన్ జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించనున్నారు. నేడు తెలంగాణలో రెండో రోజు రైతుబంధు సాయం అందజేయనున్నారు. యాసంగి పంటకు సంబంధించి రైతుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేయనుంది. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,480లు ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,350లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర […]