గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కరోనా కట్టడికి అగ్ర దేశమైన అమెరికా సైతం కోవిడ్ టీకాలపైనే ఆధారపడింది. అయితే ఇప్పటికే కరోనా టీకాలు ఆయా దేశాలు విస్తృతంగా చేపట్టాయి. ఫ్రాన్స్ వంటి దేశాల్లో 75శాతం కరోనా టీకాలు పంపిణీ జరిగినా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. కానీ మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో ఏపీలో 1,66 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 5 గురు కరోనాతో మరణించారు. తాజాగా 9,632 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో థర్డ్‌వేవ్ సంభవించింది. ఈ నేపథ్యంలో ఏపీలో గత 15 రోజుల క్రితం వరకు భారీగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించి కరోనా కట్టడికి చర్యలు చేపట్టడంతో కరోనా తగ్గుముఖం పట్టింది.