ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల ధరలు, సినిమా థియేటర్ల మూసివేత హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో నేడు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు మంత్రి పేర్ని నానితో టికెట్ల ధరలు, థియేటర్ల మూసివేతపై చర్చించి వారి ప్రతిపాదనలు అందించారు. సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. సినిమా హాళ్లలో వసతులు మెరుగుపర్చాలని గతంలోనే చెప్పామని, సమయం ఇచ్చినా మార్పు లేకపోవడంతోనే తనిఖీలు చేశామన్నారు. […]
సూర్యాపేటలో తెలంగాణ ప్రాంత శిక్షణ తరగతులలో భాగంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో 124, 2018 లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయని, స్థానికత ఆధారంగా 3 సంవత్సరాల్లో బదిలీలు చేయాలని కోరారు. కానీ 3 సంవత్సరాలు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కి పరిమిత అయ్యి, ఉద్యోగ, టీచర్ల సంఘాలతో చర్చలు జరపకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి కేసీఆర్ ఇప్పుడు పరుగులు పెడుతున్నారని ఆయన […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పటికీ కొన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో సినిమా నడుస్తోంది. ఈ నేపథ్యం చిత్ర యూనిట్ పుష్ప థాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈవెంట్‌ను ప్రత్యక్షప్రసారం ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్లో వీక్షించడానికి ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేయండి. ‘తగ్గేదేలే’….
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఉత్తమ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్లు ఏడున్నర ఏళ్లుగా డైరెక్టుగా అలయెన్స్ లో ఉన్నారని, అందుకే టీఆర్ఎస్ కేంద్రం ప్రవేశపెడుతున్న ప్రతి బిల్లుకూ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందంతో పని చేస్తున్నాయని ఆయన విమర్శించారు. 120 ఏళ్ల సింగరేణి సంస్థకు ఎంతో ఘన […]
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు. ఈ మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారాన్ని వీక్షించేందుకు ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేయండి.
టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. చిల్లర ప్రయత్నాలతో కాంగ్రెస్ చరిత్రను రూపు మాపలేరని, దేశానికి మంచి రోజులు రావాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. అంతేకాకుండా సోనియా గాంధీ నాయకత్వంలోనే దేశానికి రక్షణ కలుగుతుందని ఆయన అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలను భూస్థాపితం చేయాల్సిన బాధ్యత గాంధేయ వాదులపై ఉందన్నారు. పార్లమెంట్ లో […]
బీజేపీ నిర్వహించే ప్రజాగ్రహ సభ చరిత్రలో బూటకంగా నిలిచిపోతుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న బీజేపీకి ఏపీలో ఉన్న బీజేపీకి చాలా తేడా ఉందని, రాష్ట్రంలో ఉన్న బీజేపీ జగన్ కు అనుకూలంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.పశ్చిమబెంగాల్ లో చీమ చిటుక్కుమన్నా కేంద్ర హోంమంత్రి వెళతారని, ఏపీలో ఏమి జరిగినా కేంద్రం మాట్లాడటం లేదని ఆయన అన్నారు. కేంద్రం టెలిస్కోప్ లో రాష్ట్ర రాజకీయలను చూస్తుందని కేంద్ర […]
ఏపీ బీజేపీపై మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఎజెండానే బీజేపీ ఎజెండా అని ఆయన ఆరోపించారు. బీజేపీ నాయకులు ఏపీలో బ్రాందీ ధరలు పెరిగినందుకు బాధపడుతున్నారని, వారు బాధపడాల్సింది డిజీల్, పెట్రోల్ ధరలు పెరిగినందుకు అని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు పెట్రోల్, డిజీల్ ధరలు ఇప్పటి ధరలు పరిశీలించాలన్నారు. అంతేకాకుండా సుజనా చౌదరి, సీఎం రమేష్‌లకు బీజేపీ పార్టీని లీజుకు ఇచ్చారని, […]
ఏపీలో ఇళ్ల పట్టాలు సహా 16 పథకాలకు అర్హులైనా లబ్దిపొందని వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు ఏపీ సీఎం జగన్ మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
ఇప్పటికే ఆనారోగ్యంతో బాధపడుతున్న బీసీసీఐ చీఫ్ గంగూలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయనను కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు ఈ ఏడాది జనవరిలో గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పడు వైద్యులు గంగూలీ హార్ట్‌లో మూడు బ్లాక్స్‌ను గుర్తించి వెంటనే చికిత్స చేశారు. దీంతో గంగూలీకి ప్రాణాపాయం తప్పింది. అయితే ఇప్పుడు ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీమిండియాకు కెప్టెన్‌గా బాధ్యత వహించిన గంగూలీ.. […]