ఏపీల సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని నేడు సినీ నటుడు మోహన్‌బాబు ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పేర్ని నాని తమ ఇంటికి రావాడాన్ని తెలుపుతూ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తెలుగు సినీ ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలపై చర్చించడానికి విచ్చేసిన పేర్నినాని కృతజ్ఞతలు అన్నట్లుగా ఆయన ట్విట్ చేశారు. దీంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. మోహన్‌బాబు కాఫీకి పిలుస్తేనే వెళ్లాలని.. అక్కడ కేవలం వ్యక్తిగత విషయాలు మాత్రమే చర్చించామని ఆయన క్లారిటీ ఇచ్చారు.
అంతేకాకుండా నిన్న చిరంజీవి టీంతో జరిగిన సమావేశానికి మోహన్‌బాబు ఎందుక రాలేదంటే.. నాకు సమాచారం అందించలేదని ఆయన వెల్లడించారని నాని తెలిపారు. అంతేకాకుండా ఈ రోజు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా పేర్ని నాని స్పందించారు. సినీ ఇండస్ట్రీలో సమస్యలు సృష్టించింది చంద్రబాబేనని.. ఇప్పుడు ఆ సమస్యలను సీఎం జగన్ పరిష్కరిస్తున్నారని ఆయన వెల్లడించారు. తాను చేస్తే కాపురం.. మరొకరు చేస్తే ఇంకోటా అని చంద్రబాబుపై అగ్రహం వ్యక్తం చేశారు.