నేడు సీఎం కేసీఆర్ జనగామ జిల్లాలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఏడేళ్ల నుండి కేంద్రంతో ఏమైనా పంచాయితీ పెట్టుకున్నమా, నోరు కట్టుకొని పని చేసి ఇప్పుడిప్పుడే ఓ దారికి వస్తున్నామని ఆయన అన్నారు. వ్యవసాయని ప్రాధాన్యత పెరిగిందని, హైదరాబాద్‌కి వెళ్లిన వాళ్ళు గ్రామాలకు మళ్ళీ వస్తున్నారని, వ్యవసాయం ప్రాధాన్య పెరిగింది భూముల ధరలు పెరిగాయని ఆయన అన్నారు. రెండేళ్ల నుండి నరేంద్రమోదీ పంచాయితీ మొదలు పెట్టిండని, 2 ఏళ్ల నుండి కరెంటు మోటార్ కి మీటర్లు పెట్టాలని మోడీ చెబుతున్నాడు. విద్యుత్ సంస్కరణ పేరుతో రైతుల పైన భారం మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. మోటార్లు మీటర్లు సచ్చిన పెట్టాం అని తెగేసి చెప్పుమని ఆయన ఉద్ఘాటించారు.
గతంలో చంద్రబాబు కూడా ఇట్లనే మీటర్లు పెట్టాలే అన్నాడు.. మేము పెట్టం అన్నం ఆయన మీటరే తిప్పినం.. ఇప్పుడు మోడీ కూడా అలాగే చేస్తున్నాడని ఆయన వెల్లడించారు. నరేంద్ర మోడీ రైతుల వెంబడి పడ్డాడు పేదల వెంబడి పడ్డాడని కేసీఆర్ విమర్శించారు. లక్ష కోట్లు మోసం చేసిన వాళ్ళను వదిలేసి. పేదల కోసం మీద పడ్డాడు. కరెంటు మీటర్ల పెట్టాలి అంటే ఒప్పుకోలేదు. రైతుల కోసం కేంద్రం తో కొట్లాడుతున్నామన్నారు. నాకేదో కావాలని కోట్లాడడం లేదు రైతుల కోసం కొట్లాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇచ్చిన హామీ ఏవి అమలు చేయని కేంద్రం తీరును వ్యతిరేకిస్తుమని, అవసరం అయితే దేశాల కోసం కొట్లాడుదామన్నారు.