రాజేంద్రనగర్ పుప్పాలగూడ వద్ద భీమయ్య అనే ఎలక్ట్రీషియన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిన్న ఉదయం ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లిన భీమయ్య ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో నార్సింగి పోలీసులకు భీమయ్య స్నేహితుడు శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే ఈ రోజు ఉదయం పుప్పాల్ గూడ గుట్టల మధ్య మృతదేహం లభ్యమైంది. ఒంటి పై బట్టలు లేకుండా శరీరం పై తీవ్రగాయాలు, ఎడమ కాళు విరిగి […]
గత శనివారం రాత్రి మొయినాబాద్ సమీపంలో ముగ్గురు యువతులు ఒక స్కూటీ వస్తుండగా చెవేళ్ల నుంచి హైదరాబాద్‌కు అతివేగంగా వస్తున్న కారు యువతుల స్యూటీని ఢీ కొట్టింది. దీంతో స్యూటీపై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ప్రేమిక, సౌమ్య, అక్షరలు కిందిపడిపోయారు. అయితే ప్రేమిక తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సౌమ్య, అక్షరలకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న అక్షర ఈ రోజు మృతి చెందింది. ఇప్పటికే ఈ […]
ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల ధర, సినిమా థియేటర్ల తనిఖీలు హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. సినిమా టికెట్ ధరలు అధికంగా అమ్మినా, సినిమా థియేటర్లకు సంబంధించి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా సీజ్ చేస్తున్నారు. అయితే గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50కిపైగా థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. కొన్ని సినిమా థియేటర్ల యాజమాన్యాలు స్వచ్ఛందంగా సినిమా థియేటర్లను మూసివేశాయి. అయితే […]
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. ఇటీవల ఈ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. అయితే రోజురోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా మరో 69 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 530కి చేరుకుంది. మహారాష్ట్రలో మొత్తం 141 ఒమిక్రాన్ కేసులు ఉండగా, ఢిల్లీలో 79, కేరళలో 57, గుజరాత్లో 49, తెలంగాణలో 44, ఏపీలో 6 చొప్పున […]
ఓ ప్యాసింజర్‌లో రైలులో మంటలు చెలరేగి తడలబడ్డ ఘటన యూపీలో చోటు చేసుకుంది. కాస్గంజ్ నుండి ఫరూకాబాద్ వెళ్లే ప్యాసింజర్ రైలులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాస్గంజ్ నుంచి ఫరూకాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తరువాత కొద్ది సేపటికీ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీని గమనించిన రైల్వే స్టేషన్‌లోని అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాప సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే 3 బోగీలు […]
నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు జరుగనున్నాయి. అయితే ఈ మహాసభలు తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు సీపీఎం మహాసభలు జరుగునున్నాయి. ఈ మహాసభలకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం హజరుకానున్నారు. ఆయనతో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు. నేడు ఆన్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. జనవరికి సంబంధించిన కోటాను టీటీడీ […]
కాశ్మీర్లో పోలీసు, భద్రతా దళాల ఉమ్మడి బృందాలు గత 48 గంటల్లో 6 గురు ఉగ్రవాదులను హతమార్చాయి. అనంత్‌నాగ్‌లోని కలాన్ సిర్గుఫ్వారా గ్రామంలో ఒక ఉగ్రవాది ఉన్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను శనివారం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదిని లొంగిపోవాలని కోరినా వినకుండా విచక్షణారహితంగా పోలీసులు, భద్రతా దళాలపై కాల్పులు తెగబడ్డాడు. దీంతో ఎదురుకాల్పులు చేసి ఆ ఉగ్రవాదిని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. అయితే […]
ఎప్పడూ రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలో మరింత ఆక్సిజన్ లెవెన్స్‌ను పెంచడానికి జీహెచ్ఎంసీ మరోసారి ముందుకు వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పచ్చదనాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో లక్షలకు పైగా మొక్కలు ఏర్పాటు చేస్తూ గ్రీన్ కవర్‌ను పెంచుతోంది. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ‘తెలంగాణకు హరితహారం’ను ప్రపంచంలోనే అడవుల పెంపకంలో మూడవ అతిపెద్ద ప్రయత్నంగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. అయితే ‘తెలంగాణకు హరితహారం-2022’లో భాగంగా, మరిన్ని మొక్కలు నాటడం ద్వారా నగరాన్ని పచ్చదనంతో నింపాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. […]
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసింది. ఆ వ్యవసాయ చట్టాలు పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా సుమారు ఏడాది పాటు నిరసనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వాటిని రద్దు కూడా చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆ వ్యవసాయ చట్టాలను తీసుకువస్తుందని, […]
సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టువస్త్రాలను ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు సమర్పించారు. ఈ కల్యాణోత్సవ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు కూడా హజరయ్యారు. మల్లన్న స్వామి కల్యాణోత్సవంతో నేటి నుంచి కొమురవెల్లిలో మల్లన్న […]