తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ రోజుల హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు నిరుద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ దీక్షలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. తెలంగాణలో నాదర్శ్ షా ప్రభుత్వం నడుస్తుందని, ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని కేసీఆర్ అన్నాడు.. వచ్చాయా అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రి […]
టీపీసీస రేవంత్ రెడ్డిపై ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. బీజేపీకి అమ్ముడుపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, నాడు టీడీపీని కాంగ్రెస్ కు అమ్మి… నేడు కాంగ్రెస్ ను బీజేపీకి అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా కేసీఆర్ రైతు బిడ్డ.. రేవంత్ రెడ్డి కమర్షియల్ బిడ్డ. ఏది ఎక్కడ ఎంతకు అమ్ముకోవాలనే చూస్తారని, ఎర్రవెల్లి గ్రామానికి వస్తే తరిమికొడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారని ఆయన అన్నారు. రేవంత్ […]
ఏపీ ప్రభుత్వం ఇటీవల వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటీఎస్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి. అయితే తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఓటీఆఎస్ను రద్దు చేయాలంటూ కలేక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారిని జగన్ దోపిడీ చేస్తున్నాడని ఆయన అన్నారు. […]
వరి కోసం తెలంగాణలో అధికార పార్టీకి విపక్షాలకు మధ్య వార్ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడంతో యాసంగిలో వరి ధాన్యం వేయకూడదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే విపక్షాలు మాత్రం వరి వేయండి అంటూ రైతులకు సందేశాలు ఇస్తున్నాయి. అయితే దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ క్రింద ఇచ్చిన లింక్‌లో వీక్షించండి.
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజుల రేవంత్ రెడ్డి ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రచ్చబండ కార్యక్రమం ఎర్రవెల్లిలో నిర్వహిస్తున్నారని ఆయన బైకాట్ చేశారు. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు […]
గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను పట్టిపీడిస్తున్న కరోనా మహ్మారి బెడద ఇంకా తగ్గడం లేదు. తాజాగా దేశవ్యాప్తంగా కొత్తగా 6,531 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా దేశంలో కరోనా నుండి గడిచిన 24 గంటల్లో మరో 7,141 మంది కోలుకొని ఆసుప్రతి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 75,841 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోని పలు […]
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ‘నిరుద్యోగ దీక్ష’ చేపట్టారు. ఈ దీక్షను ముందుగా ఇందిరాపార్క్ వద్ద చేపట్టాలని భావించారు.అయితే కోవిడ్ నిబంధనల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బండి సంజయ్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంబంధంచి ప్రత్యక్ష ప్రసారాన్న వీక్షించడానికి ఈ క్రింద లింక్‌ను క్లిక్ చేయండి.
హైదరాబాద్‌లోని కొన్ని పబ్‌లు పరిమితి సమయాన్ని మించి నడిపిస్తున్నారని, ఇళ్ల మధ్యలో లౌడ్ స్పీకర్లు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇటీవల పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు పరిమితి సమయాన్ని మించి పబ్‌లు నిర్వహించవద్దని, నివాస ప్రాంతాలకు సమీపంలో పబ్‌లు నిర్వహించరాదని హెచ్చరించింది. దీంతో నిన్న జూబ్లీహిల్స్ ర్యాబిట్ పబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత రాత్రి సమయానికి మించి పబ్ యాజమాన్యం పబ్ నడిపినట్లు సమాచారం రావడంతో […]
పార్ట్‌టైం జాబ్ అంటూ ‘లవ్ లైఫ్’ పేరుతో వేలాది మంది దగ్గర నుంచి సుమారు రూ.200 కోట్లు మోసం చేసిన ఘటనలో బాధితులు రాష్ట్రవ్యాప్తంగా బయటకు వస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుల్లోనే కాక ఇలా రాష్ట్రవ్యాప్తంగా లవ్‌లైఫ్ యాప్ బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో బాధితులు ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 18 లక్షలు కట్టినట్టు బెజవాడ సైబర్ పోలీసులకు ఓ బాధితుడు […]
ఏడుకొండల వేంకటేశ్వర స్వామివారిని దర్శించేందుకు ఎక్కడెక్కడినుంచే భక్తులు వస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో శ్రీవారి దర్శానానికి ఆన్లైన్లో టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. అయితే తాజాగా జనవరి నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ ఈ రోజు ఉదయం 9 గంటలు విడుల చేసింది. అయితే హాట్ కేకుల్లా సర్వదర్శనం టోకెన్లు బుక్కాయ్యాయి. జనవరి నెలకు సంబంధించి 2.60 లక్షల టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. అయితే విడుదల చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే మొత్తం టొకెన్లు అన్ని […]