ఇటీవల ఎన్నికల సంఘం (ఈసీ) ఐదు రాష్ట్రాలకు ఎన్నిలక షెడ్యూల్‌ను విడుదల చేసింది. 7 దశల్లో 5 రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో గోవాలో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఇప్పటికే ఆమ్ఆద్మీ పార్టీ గోవాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గోవా ఓటర్లకు హామీలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో అధికారంలోకి వస్తే రూ.3 వేలు నిరుద్యోగ భృతి […]
పోలీసులపై పేకాటరాయుళ్లు దాడి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. భీమడోలు మండలం గుండుగొలనులో నిన్న అర్థరాత్రి పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే పోలీసులు దాడులు నిర్వహించడంతో పేకాటరాయుళ్లు తిరుగబడి పోలీసులపైనే దాడులు చేశారు. ఈ దాడిలో పోలీసులు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసుల నమోదు చేసుకున్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడిచేసిన నిందితులు ఏలూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. నిందితులు […]
సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. రాజ్యసభ సీటు కోసమే చిరంజీవి జగన్‌తో సమావేశమయ్యారంటూ వివిధ కోణాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. మంత్రి బాలినేని వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ కౌంటర్ ఇచ్చారు. ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం. ప్రజలకు నిజాలు చెప్పండి అని నారాయణ అన్నారు. కనుమ పండుగ రోజు కూడా కఠోర వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి […]
కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి 80వ జయంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్డులోని స్పూర్తి స్థల్లో కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ఏ పార్టీలో ఉన్న అందరితో కలిసి మెలిసి జైపాల్ రెడ్డి పని చేశారని, జైపాల్ రెడ్డి లేకపోవడంతో దేశానికి చాలా లోటని ఆయన అన్నారు. కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని ఆయన గుర్తు చేశారు. నిత్యం పార్టీ, దేశం కోసం ఆలోచించే వారని ఆయన […]
నెక్లెస్ రోడ్డులో స్ఫూర్తి స్థల్లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 80వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి లేకపోయినా ఆయన సాధించిన తెలంగాణలో మనము ఉన్నామన్నారు. రాజకీయ విలువలు కాపాడడంలో జైపాల్ రెడ్డి ఒకరని, దేశానికి వన్నె తెచ్చే నిర్ణయాలు జైపాల్ రెడ్డి తీసుకున్నారని గుర్తు చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌లో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆయన […]
రాజేంద్రనగర్ హైదర్‌గూడ లోని ఇష్తా సిటీ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 521 ఫ్లాట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది చూసిన అపార్ట్మెంట్ వాసులు బయటకు పరుగులు పెట్టారు. మంటలు భారీగా మంటలు వ్యాప్తించి అగ్నికీలలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. అయితే ఇంట్లోని సామాగ్రి పూర్తి […]
అనంతపురం జిల్లాలో శిల్పకళా క్షేత్రం లేపాక్షి ఆలయ సమీపంలో అతి పురాతనమైన రాతి స్థంభాలు బయటపడ్డాయి. జాతీయ రహదారి పనులకు చేపట్టిన పనుల్లో రాతి స్థంభాలు వెలుగుచూసాయి. దీంతో ఈ వార్త స్థానికులకు తెలియడంతో రాతి స్థంభాలను చూసేందుకు జనం ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పురావస్తు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే రహదారి పనుల్లో బయటపడ్డ వాటిని మట్టిలో పూడ్చకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. చెరువులో అప్పట్లో ఆలయం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ […]
దేశంలో కరోనా తగ్గనంటోంది. రోజురోజుకు కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరుతూవస్తున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. థర్డ్‌వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు విధించాయి. ఏపీలో కూడా ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో కూడా కరోనా కేసులు […]
రాజేంద్రనగర్‌లో ఓ యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అత్తాపూర్ చింతల్మెట్లోని మెఘల్ మెడోస్ అపార్ట్మెంట్లో ఓఫ్లాట్‌లో బ్యూటీషియన్ పనిచేసే సుమేరా బేగం అనే యువతి నివాసం ఉంటుంది. అయితే సదరు యువతి ఉంటున్న ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్ లోపలికి వెళ్లి చూడడంతో సుమేరా బేగం చున్నీ ప్యాన్‌కు ఉరి వేసుకుని విగతజీవని కనిపించింది. అయితే […]
సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి ఆలయంలో భక్తులతో రద్దీగా మారింది. నేటి నుంచి కొమురవెల్లి మల్లన్న దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. నేడు పట్నంవారంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా దృష్ట్యా అంతర్గతంగా అగ్నిగుండాలు, పెద్దపట్నం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కొమురవెల్లి మల్లన్న దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు ఆలయాని విచ్చేశారు. దీంతో స్వామి వారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ ధరించకుంటే ఎవ్వరినీ […]