ధర్మం, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని, రాజధాని అమరావతి విషయంలో అదే జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుర్మార్గులు పెట్రేగిపోవటం తాత్కాలికమేనని, ఎస్సీలు, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకుంటే జగన్‌కి కులం అడ్డొచ్చిందని ఆయన విమర్శించారు. శ్రీకాకుళం-అనంతపురానికి మధ్యలో ఉన్న అమరావతిని రాజధాని గా ఎంపిక చేస్తే జగన్ మద్దతు తెలిపారని, అమరావతితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధి కి శ్రీకారం చుట్టామన్నారు. ఆరోజు అడ్డం రాని కుల-మతాలు ఈ రోజు ఎందుకు అడ్డొచ్చాయి.
అర్థంలేని విధానాలతో 3 ముక్కల ఆటకు శ్రీకారం చుట్టారు. అమరావతి కోసం మహిళలు వీరోచితంగా పోరాడారు. అమరావతి రైతుల పోరాటం సర్పంచులకు స్ఫూర్తి కావాలి అని ఆయన అన్నారు. ప్రజల ఆస్తికి ప్రభుత్వం 5 ఏళ్ళు ట్రస్టీ మాత్రమే అని కోర్టు తీర్పుతో రుజువైందని, అమరావతి విజయం రూ. 5 కోట్ల తెలుగు ప్రజలదన్నారు. పోలీసులతో ఎల్లకాలం నోరు మూయించలేరని, ప్రజలు తిరగబడితే పోలీసులైనా ఏం చేస్తారు, అమరావతి రైతుల పక్షాన నిలిచిన ప్రజలందరికీ వందనాలు తెలిపారు.