పీఆర్సీపై ఏపీలో ఇంకా స్పష్టత నెలకొనలేదు. ఇటీవలే సీఎం జగన్ పీఆర్సీని ప్రకటించారు. అయితే పీఆర్సీపై ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని, సమ్మెకు వెళ్తామని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఈ సందర్బంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. పీఆర్సీపై కొన్ని ఉద్యోగ సంఘాలు పాజిటివ్‌గా, కొన్ని వ్యతిరేకంగా మాటాడుతున్నాయని ఆయన అన్నారు. ఉద్యోగులు సంతృప్తికరంగా, ఆనందంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎక్కడొ కొన్ని సంఘాలు ఎవరో కొంతమంది వెనుకనుండి ప్రోద్బలం వలన సమ్మెకు వెళ్తామనడం ఆలోచించాల్సిన విషయమన్నారు. […]
నకిలీ కాల్ సెంటర్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగేళ్ళ వ్యవధిలో 1000 కోట్లు మోసం చేసినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కీలక సూత్రాధారి నవీన్ భూటానీ కనుసన్నల్లో ఈ ముఠా కార్యకలాపాలు నడిచినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతర్జాతీయ క్రెడిట్ కార్డు హోల్డర్స్ ను టార్గెట్‌గా చేసుకొని బురుడి కొట్టించినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. యూకే , ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల క్రెడిట్ కార్డ్ లకు ఇండియా బ్యాంక్‌లు […]
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని క్లబ్‌లల్లో, సినిమా హాళ్లలో, షాపింగ్ మాల్స్‌లలో తనిఖీలు చేస్తున్నట్లు తెలంగాణ సెంట్రల్ రీజినల్ అగ్నిమాపక శాఖ ఆఫీసర్ పాపయ్య వెల్లడించారు. సికింద్రాబాద్ క్లబ్ అగ్నిప్రమాదం ఘటన తర్వాత హైదరాబాద్‌లోని అన్ని క్లబ్‌లలో తనిఖీలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25కు పైగా క్లబ్ లు ఉన్నాయని, నిన్న 17 క్లబ్‌లల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని, ఈరోజు, రేపు తనిఖీలు నిర్వహించిన […]
హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. పరకాల, నడికూడ, రేగొండ మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నిరంజన్ రెడ్డి వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉన్నతాధికారులు ఉన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులతో నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు లు మాట్లాడారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను మంత్రులు తెలుసుకున్నారు. నేలరాలిన మిర్చిపంటలను మంత్రులకు చూపిస్తూ.. సర్వం నష్టపోయామని, ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. తమను ఆదుకోవాలని మహిళా రైతులు […]
కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతోంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే పోలీసులు కరోనా బారినపడుతుండగా.. ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం రేపుతోంది. సాధారణ పరిపాలన, విద్యాశాఖలోని పలు విభాగాల్లో 15 మందికి కరోనా సోకింది. విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. జీఏడీ ప్రిన్సిపాల్ సెక్రటరీ పేషీలో ముగ్గురు పీఎస్‌లతో పాటు మరికొందరూ కరోనా […]
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటన గుంటూరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. నిన్న వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటనలో పోలీసులు ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీంతో వారి అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ నేత అరవింద్ బాబు ధర్నా చేపట్టారు. పోలీసులు అరవింద్ బాబు ధర్నా చేపట్టిన స్థలానికి చేరుకొని ధర్నా ఆపే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో అరవింద్‌కు గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. […]
కరోనా రక్కసి ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటికే కరోనా సోకి కోలుకున్న వారు సైతం కరోనా బారినపడుతున్నారు. ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత కరోనా కేసుల సంఖ్యం దేశవ్యాప్తంగా పెరుతూవస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే తెలుగువారికి ప్రత్యేకమైన సంక్రాంతి పండుగను పురస్కరించికొని నైట్ కర్ఫ్యూను 18వ తేదీ నుంచి పెడుతున్నట్లు […]
బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడ్డ తెలంగాణలో వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యం సూర్యాపేటలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటజిల్లాలో అకాల వర్షాల పట్ల అధికారులను అప్రమత్తం చేశారు. ఈ […]
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా రక్కసి ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత మళ్లీ పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు భారీ నమోదవుతున్నాయి. అయితే థర్డ్‌వేవ్‌లో ఎక్కువ మంది కరోనా బారినపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెల్లా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి శరవేగంగా ఉన్నందున కరోనా కేసుల భారీగా నమోదవుతున్నాయని వైద్యులు అంటున్నారు. అయితే తాజాగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోకి కూడా ఈ కరోనా వైరస్ ప్రవేశించింది. […]
నిన్న వైఎస్సాఆర్ విగ్రహం ధ్వంసమైన ఘటన వివాదం రేపుతోంది. అయితే వైఎస్సాఆర్ విగ్రహ ధ్వంసం ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్తలను వదిలిపెట్టాలని నరసరావుపేటలోని జొన్నలగడ్డలో టీడీపీనేత అరవింద్ బాబు టీడీపీ కార్యకర్తలతో ధర్నా దిగారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అరవింద్ ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకున్నారు. అయితే ధర్నా విరమించాలని అరవింద్‌ను పోలీసులు కోరగా అరవింద్‌కు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. […]