బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నివాసంపై దుండగులు రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. కథ స్క్రీన్ ప్లే అంత సీఎం ఆఫీస్ నుండే జరిగిందన్నారు. సినిమా రిలీజ్ కాకా ముందే కథ అడ్డం తిరిగింది. కొందరు ఐపీఎస్ అధికారుల తీరు ను చూసి కింది స్థాయి పోలీసులు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు. సీఎం కి కొమ్ముకాస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, నిన్న జరిగిన ఘటనకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బలి అవుతారు…. వారిని సీఎం కాపాడుతారా అని ఆయన అన్నారు.
జితేందర్ రెడ్డి కేసీఆర్ దగ్గర ఉన్నాడు… ఎంత మంది హత్యకు కుట్ర చేశారో సీఎం చెప్పారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి ల పై తప్పుడు కథనాలు రావడం బాధాకరమన్నారు. వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేశారు. కేసులో వారిద్దరి పేర్లు లేవు. ఆరోపణలు చేసిన trs నాయకులు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు.. హత్య రాజకీయాలను బీజేపీ సమర్థించదని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు రిమాండ్ చేయబడ్డ వారు తమకు ప్రాణ భయం ఉందని మానవ హక్కుల కమిషన్ కి గతంలో ఫిర్యాదు చేసారన్నారు.